వైసీపీ నేత, వైజాగ్ (వెస్ట్) మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చిట్ ఫండ్ కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విజయప్రసాద్ ప్రస్తుతం ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నారు. 2019లో చిట్ ఫండ్ అవకతవకలకు సంబంధించి ఆయనపై ఒడిశాలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు ఒడిశా సీఐడీ పోలీసులు తెలిపారు. తొలుత విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేజిస్ట్రేట్ అనుమతితో ఒడిశా తరలించారు.
మళ్ల విజయప్రసాద్ కు చిట్ ఫండ్ వ్యాపారం కూడా ఉంది. ఏపీలోనూ, పలు ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాంచీలు ఏర్పాటు చేశారు. అయితే, తమకు చెల్లింపులు జరపడం లేదంటూ కొందరు డిపాజిట్ దారులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై రెండేళ్ల కిందటే ఒడిశాలో కేసు నమోదైంది. ఆయన ‘వెల్ఫేర్’ సంస్థ పేరుతో మళ్ల రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తున్నారు. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాలోనూ చిట్‌ఫండ్ వ్యాపారం చేశారు. అక్కడ డిపాజిట్‌దారులకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో ఫిర్యాదులందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఐడీ పోలీసులు సోమవారం విశాఖ వచ్చారు. మళ్ల విజయ్‌ప్రసాద్‌ను స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఒడిశా సీఐడీ పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.