More

  50ఏళ్ళుగా ఓటమి ఎరుగని నేత..! జకీర్ దెబ్బకు డిపాజిట్ గల్లంతు..!!

  తాజాగా జరిగిన ఎన్నికల్లో మలేషియా మాజీ ప్రధాని మహతిర్ మొహమద్ ఘోర ఓటమి పాలయ్యాడు. తాను పోటీచేసిన పార్లమెంట్ స్థానంలో ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. తన ఐదు పదుల రాజకీయ జీవితంలో ఆయన ఓటమిపాలు కావడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యంత వృద్ద ప్రధానిగా గిన్నిస్ రికార్డు సాధించిన మహతిర్ ఓటమికి కారణాలేంటి..? వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ను వెనకేసుకురావడమే ఇందుకు కారణమా..? ఈ ఓటమితో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు, ఎప్పుడూ చెప్పేదే అయినా ప్రియమైన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు మరోసారి విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ తో పాటు.. అన్ని గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఈ వీడియోను పదిమందికీ షేర్ చేయండి. బెల్ ఐకన్ నొక్కి జాతీయవాద జర్నలిజానికి మీ మద్దతు తెలియజేయండి.

  ఇప్పుడు మేటర్ లోకి వద్దాం. మహతిర్ మొహమ్మద్ దాదాపు 53 ఏళ్ళుగా మలేషియా రాజకీయాల్లో ఉన్నాడు. నార్తర్న్ పెర్క్ లోని తంబన్ నియోజకవర్గం నుంచి యాభైఏళ్ళుగా ఎంపీగా గెలుస్తూ వచ్చిన మహతిర్ తన రాజకీయ జీవితంలో దాదాపు 24 ఏళ్ళు మలేషియా ప్రధానిగా పనిచేశాడు. 93 ఏళ్ళ వయసులో కూడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రపంచంలోనే అత్యంత వృద్ద పీఎంగా గిన్నిస్ రికార్డు సాధించాడు. అయితే ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనుభవించిన మహతిర్ కు శాపమే తగిలిందో.. లేక గతంలో చేసిన పాపాలు వెంటాడాయో తెలియదు కానీ,.. లాంగ్ క్వాయ్ పార్లమెంట్ స్థానంలో ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 ఎన్నికల్లో గెలుపొందిన మహతిర్.. ప్రధానిగా ఉన్న సమయంలో వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్ ను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలతో పాటు మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న జకీర్ నాయక్ భారత్ నుంచి పారిపోయి మలేషియాలో తలదాచుకున్నాడు. దీంతో అప్పుడు మలేషియా ప్రధానిగా ఉన్న మహతిర్ మొహమద్.. జకీర్ నాయక్ కు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించాడు. భారత్ అతడిని అప్పగించాలని ఎన్నిసార్లు అభ్యర్థించినా మహతిర్ ఒప్పుకోలేదు. ఇక మలేషియా ప్రజలు కూడా ఈ వివాదాస్పద మత ప్రభోధకుడిని దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోకుండా 2019లో జకీర్ నాయక్ కు మలేషియాలోనే శాశ్వతంగా నివసించేందుకు పౌరసత్వాన్ని జారీ చేశాడు. దీంతో పాటు 2020 లో ప్రధానమంత్రి ఎన్నికలు జరిగే సమయంలో కూడా జకీర్ నాయక్ ను భారత్ కు పంపటం శ్రేయస్కరం కాదనీ,.. అతడు ఏ దేశంలోనైతే సురక్షితంగా ఉంటాడో ఆ దేశానికి పంపడానికి తాను సహాయం చేస్తానని చెప్పుకొచ్చాడు.

  అయితే ఆ తర్వాతి ప్రధానమంత్రి ఎన్నికల్లో మహతిర్ ఓడిపోవడంతో జకీర్ నాయక్ మలేషియా ను వదిలి పారిపోయాడు. ఇక ప్రధానిగా మహతిర్ దిగిపోవడానికి ఎన్నో కారణాలున్నా అందులో జకీర్ నాయక్ ను కాపాడటం కూడా ఒకటి. ఈ విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా మహతిర్ పట్టించుకోకపోవడంతో అదే అతను దిగిపోవడానికి కారణమైంది. ఇక తాజా ఎన్నికల్లో ప్రధాని పదవి అటుంచితే స్వంత ఎంపీ స్థానంలోనే డిపాజిట్ కోల్పోయాడు. మహతిర్ ప్రధానిగా దిగిపోయిన తర్వాత జకీర్ నాయక్ మెల్లిగా మలేషియా నుంచి జారుకుని ఇప్పుడు ఖతార్ లో తల దాచుకుంటున్నాడు. ఆ దేశంలో అన్ని అతిధి మర్యాదలూ అందుకుంటున్నాడు. గతంలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన కువైట్ ప్రభుత్వం సరిగ్గా అటువంటి వ్యాఖ్యలే చేసిన జకీర్ నాయక్ కు మాత్రం అతిధి మర్యాదలు అందజేస్తోంది. ఫిఫా లాంటి ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ కప్ టోర్నమెంట్ లలో ఇస్లాం మత బోధనలకు జకీర్ నాయక్ ను ఆహ్వానించింది.

  Trending Stories

  Related Stories