మలయాళ దర్శకుడు అలీ అక్బర్ ఇస్లాంను విడిచిపెట్టిన ఒక నెల తర్వాత అధికారికంగా హిందూ మతంలోకి మారారు. డిసెంబర్ 10వ తేదీన అలీ అక్బర్ తాను ఇస్లాంను విడిచిపెడుతున్నానని, ఇక నుంచి రామసింహన్ అని పిలవండని ప్రకటించారు. గురువారం ఆయన అధికారికంగా మతం మారినట్లు ప్రకటించారు. హిందూ కార్యకర్త మరియు హిందూ సేవా కేంద్ర వ్యవస్థాపకుడు ప్రతీష్ విశ్వనాథ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. అలీ అక్బర్ హిందూ మతంలోకి తిరిగి మారినట్లు తెలియజేశారు. విశ్వనాథ్ పోస్ట్ చేసిన చిత్రాలకు, “చరిత్ర పునరావృతమవుతుంది, అలీ అక్బర్ ఇప్పుడు రామసింహన్” అని క్యాప్షన్ ఇచ్చారు. తిరిగి హిందూ మతంలో చేరే సమయంలో ఆయన భార్య లూసియమ్మ కూడా అక్కడే ఉన్నారు.

హిందూ మతంలోకి మారడానికి కారణం:
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణాన్ని కొందరు మతోన్మాదులు సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రముఖ మలయాళ దర్శకుడు అలీ అక్బర్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణాన్ని సెలెబ్రేట్ చేసుకున్న వారికి నిరసనగా ఇస్లాంను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అలీ అక్బర్ ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు, తనకు-తన కుటుంబానికి ఇకపై మతం లేదని అప్పట్లో తెలిపారు. సీడీఎస్ బిపిన్ రావత్ మరణాన్ని అపహాస్యం చేసిన ఇస్లాంవాదులను విమర్శిస్తూ అలీ అక్బర్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అక్బర్ ఖాతా ఒక నెల పాటు నిలిపివేయబడింది. దీంతో దర్శకుడు మరో ఖాతా తెరిచి తాను ఇస్లాంను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. అలీతో పాటు ఆయన భార్య కూడా ఇస్లామ్ మతాన్ని వదిలివేస్తున్నట్లు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇకపై తాను నేను ముస్లింను కాదని.. నేను ఇండియన్‌ను మాత్రమే అంటూ అక్బర్ వీడియోలో చెప్పారు. ఇక నుంచి తన పేరు రామసింహన్ అని అన్నారు. ‘‘కేరళ సంస్కృతికి కట్టుబడి హత్యకు గురైన వ్యక్తి రామసింహన్. ఇకపై అలీ అక్బర్‌ని రామసింహన్ అని పిలుస్తారు. అది మంచి పేరు, ”అని అని చెప్పుకొచ్చారు. 1947లో ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారినందుకు రామసింహన్, అతని కుటుంబాన్ని ఇస్లాంవాదులు చంపేశారు. రామసింహన్, అతని సోదరుడు దయాసింహన్, దయాసింహన్ భార్య కమల, వారి వంట మనిషి రాజు అయ్యర్, ఇతర కుటుంబ సభ్యులను మలప్పురం జిల్లాలోని మలపరంబలో ఇస్లామిక్ జిహాదీలు ఆగష్టు 1947, స్వాతంత్ర్యానికి కేవలం రెండు వారాల ముందు 2వ తేదీన దారుణంగా నరికి చంపారు. అందుకనే రామసింహన్ పేరును పెట్టుకున్నానని అన్నారు. అలీ అక్బర్ తన భార్యతో చర్చించిన తర్వాత ఇస్లాంను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.