More

  పెళ్లి చేసుకున్న మలాలా.. ఎవరినంటే..?

  నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసుఫ్‌జాయ్ పెళ్లి చేసుకుంది. పాకిస్థాన్‌లో బాలికా విద్య కోసం పాడుపడుతూ ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తింది మలాలా. ఆమెను చంపడానికి పాక్ లోని ఉగ్రవాదులు ప్రయత్నించారు. 2012లో ఆమె ఉన్న పాఠశాల బస్సులోకి చొరబడిన తాలిబన్లు కాల్పులు జరిపారు. స్వల్ప గాయాలతో మలాలా బయట పడింది. బ్రిటన్‌లో చికిత్స అనంతరం ఆమె అక్కడే ఉంది. బాలికల విద్య కోసం పోరాటం చేస్తున్న ఆమెకు 2014లో 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ బహుమతి అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా మలాలా రికార్డు నెలకొల్పింది.

  తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తున్న మలాలా కుటుంబ సభ్యుల సమక్షంలో అస్సర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని.. అన్సర్, తాను జీవిత భాగస్వాములమయ్యామని, తమ నిఖా నిరాడంబరంగా జరిగిందని తెలిపింది. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం సాగించడానికి సంతోషంగా ఉన్నామని.. తమకు ఆశీస్సులు పంపాలని కోరింది.

  మలాలా ఎవరిని పెళ్లి చేసుకుందోనని సామాజిక మాధ్యమాల్లో ఆరా తీస్తున్నారు. ఆమె భ‌ర్త పేరు అస్సర్ మాలిక్‌. అతడు ప్ర‌స్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై ప‌ర్ఫార్మెన్స్ సెంట‌ర్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా ఉన్నాడు. గ‌త ఏడాది మే నెల‌లో ఆయ‌న పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఉద్యోగిగా చేరాడు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ఆడుతున్న ముల్తాన్ సుల్తాన్ జ‌ట్టుకు ఆప‌రేష‌న‌ల్ మేనేజ‌ర్‌గా చేశాడు. అస్సర్ మాలిక్‌ ప్లేయ‌ర్ మేనేజ్మెంట్ ఏజెన్సీని కూడా న‌డిపాడని తెలుస్తోంది. అస్సర్ మాలిక్ లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS) నుండి 2012 (2008-2012)లో ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. థియేటర్ ప్రొడక్షన్స్ చేసే డ్రామాలైన్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అస్సర్ మాలిక్, మలాలా యూసఫ్‌జాయ్ ఎప్పటి నుండి ఒకరినొకరు తెలుసో స్పష్టంగా తెలియనప్పటికీ.. ఈ జంటకు జూన్ 2019 నుండి ఒకరికొకరు తెలుసని పాక్ మీడియా చెబుతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో పాకిస్తాన్‌ను ఉత్సాహపరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ సెల్ఫీని పంచుకున్న సమయంలో మలాలా అతనితో ఉంది.

  Trending Stories

  Related Stories