మసీదుల నుంచి స్కూళ్లు, కాలేజీలకు లౌడ్ స్పీకర్లు..!

0
714

ప్రార్ధ‌నా స్ధ‌లాల నుంచి లౌడ్‌స్పీక‌ర్లు తొల‌గించాల‌ని యూపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసిన నేప‌థ్యంలో ఫిలిబిత్ జిల్లా అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రార్ధ‌నా స్ధ‌లాల నుంచి తొల‌గించిన లౌడ్‌స్పీక‌ర్ల‌ను స్కూళ్లు, కాలేజీల‌కు అంద‌చేశారు.

ఎస్పీ దినేష్ కుమార్ ఆదేశాల‌తో మ‌త పెద్ద‌లు జిల్లాలోని ఆల‌యాలు, మ‌సీదులు, గురుద్వారల నుంచి లౌడ్‌స్పీక‌ర్ల‌ను తొల‌గించారు. ఈ లౌడ్‌స్పీక‌ర్ల‌ను పిలిబిత్‌లోని విద్యామందిర్ కాలేజ్ స‌హా జిల్లాలోని స్కూళ్ల‌కు అంద‌చేశారు. మ‌త పెద్ద‌ల నిర్ణ‌యాన్ని ఎస్పీ ప్ర‌శంసించారు. స్కూళ్ల‌కు లౌడ్‌స్పీక‌ర్లు ఇవ్వ‌డంతో ఇవి టీచ‌ర్లు, విద్యార్ధుల‌కు స్వాతంత్ర్య దినోత్స‌వం, గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌తో పాటు స్కూల్ వార్షికోత్స‌వాల‌కు ఇత‌ర విద్యా సంబంధ కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఎస్పీ తెలిపారు. మ‌త పెద్ద‌లు తీసుకున్న నిర్ణ‌యంతో ఇత‌రులు కూడా అనుస‌రిస్తూ లౌడ్‌స్పీక‌ర్ల‌ను స‌మ‌ర్ధంగా ఉప‌యోగించుకునేందుకు పూనుకుంటార‌ని అన్నారు.

మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు ఉండడంపై చాలా రాష్ట్రాల్లో వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని డిమాండ్‌లు వచ్చాయి. ఈ క్రమంలో యూపీలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సమీపంలో నివసించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లౌడ్ స్పీకర్ల శబ్ద పరిమాణాన్ని తప్పనిసరిగా పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో స్పీకర్లను తొలగించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here