More

    జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న దసరా మూవీ.. హీరో మహేష్ బాబు ఆసక్తికర కామెంట్స్..!

    దసరా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రం పై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. దసరా సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. ఈ సినిమా చూసి గర్వపడుతున్నానని మహేష్ బాబు పోస్ట్ చేశారు.

    నాని నటించిన దసరా సినిమా రెండు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తొలి రోజునే రూ.38 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను వ‌సూలు చేసిన ద‌స‌రా సినిమాకు, రెండో రోజున దాదాపు రూ.15 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. రెండు రోజుల్లో రూ.52.40 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌సరా సినిమా రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.

    Trending Stories

    Related Stories