More

    కోవిడ్ విజృంభణలో ఆ మూడు రాష్ట్రాల వాటా 84.71%

    దేశ వ్యాప్తంగా నిన్న కొత్తగా 18,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 10,187 కేసులు మహారాష్ట్రవి కాగా కేరళ వి 2791, పంజాబ్ వి 1159. అంటే ఆల్మోస్ట్ కేసుల్లో 84.71 శాతం ఈ మూడు రాష్ట్రాలకు చెందినవే..

    కోవిడ్ మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రారంభమైనా.. కొత్తగా రూపాంతరం చెందుతున్న స్ట్రెయిన్స్ తో పాండమిక్ భయం ఇంకా వెంటాడుతుందనే చెప్పాలి. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో లెక్క ఒకలా ఉంటే ఒక రెండు రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా వుంది. అన్ని చోట్లా తగ్గుతున్నా ఇక్కడ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కేసులు. ఆ రాష్ట్రాలే కేరళ, మహారాష్ట్ర.

    దేశం మొత్తం మీద నమోదవుతున్న మొత్తం కేసుల్లో 70 నుంచి 80 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల వాటానే. పాలకుల అసమర్ధతతకు ఇది నిదర్శనంగా భావిస్తున్నారు విశ్లేషకులు.కోవిడ్ పాండమిక్ ఆరంభంలో కేరళ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ పోట్రే చేసిన మీడియా ఇప్పడు అక్కడ కేసులు పెరుగుతుంటే మాత్రం కింమనడం లేదు.. మరి ఎందుకనో..?ఇక మహారాష్ట్ర పరిస్థితి దారుణం.. ఇప్పడు ఈ రాష్ట్రానికి వెళ్లి రావడం అంటే చైనాక వెళ్లి రావడమంత ప్రమాదం అంటున్నారు.

    తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కరోనా స్ట్రెయిన్స్ ప్రభావం మహారాష్ట్రలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ సామాన్యుల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు దాకా అందరికీ ఈ మహమ్మారి తాకేస్తోంది. తాజాగా ముంబైలోని జేజే హాస్పిటల్… ఎమ్మెల్యేలు, ఇతర సిబ్బందికి కరోనా టెస్టులు చెయ్యగా… 36 మందికి పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా… మార్చి 6, 7న 2,746 శాంపిల్ టెస్టులు చేశారు. వాటిలో ఈ విషయం తెలిసింది.

    ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జర్నలిస్టుల నుంచి ఈ శాంపిల్స్ సేకరించారు. వీరంతా వారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. గత వారం 3,900 శాంపిల్స్ తీసుకొని టెస్టులు చెయ్యగా… అప్పుడు 42 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం కష్టమవుతోంది. ఇంతకు ముందు కూడా ఇవే సమావేశాలు నిర్వహించాలనుకొని… కరోనా వల్ల వాయిదా వేశారు.

    ఆదివారం మహారాష్ట్రలో 10,187 కొత్త కరోనా కేసులు వచ్చాయి. రికవరీలు పోగా… అదనంగా 5,090 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో ఒక్క రోజులో పెరిగాయి. ఆదివారం 45 మంది చనిపోవడంతో… అక్కడి మొత్తం మరణాల సంఖ్య 52,478కి చేరింది.

    ఫిబ్రవరి 19 నుంచి మహారాష్ట్రలోని అమరావతి ఏరియాలో కొత్తరకం కరోనా వైరస్ బయటపడింది. అది వేగంగా వ్యాపించడమే కాదు… అది సోకిన వారికి త్వరగా నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు విస్తరించిందనే అభిప్రాయం ఉంది. ఐతే… అది బ్రిటన్ లేదా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన స్ట్రెయిన్ కాదని అంటున్నారు. కానీ అది దాదాపుగా దక్షిణాఫ్రికా, బ్రెయిల్‌లో వ్యాపిస్తున్న వైరస్‌కి దగ్గరి పోలికలతో ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ కేసులు బ్రెజిల్‌లో నమోదవుతున్నాయి.

    దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలలో పరిస్థితి కొంత అదుపులోనే ఉంది. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

    దేశ వ్యాప్తంగా నిన్న కొత్తగా 18,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 10,187 కేసులు మహారాష్ట్రవి కాగా కేరళ వి 2791, పంజాబ్ వి 1159. అంటే ఆల్మోస్ట్ కేసుల్లో 84.71 శాతం ఈ మూడు రాష్ట్రాలకు చెందినవే..

    ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,12,29,398కి చేరింది. కొత్తగా 97 మంది మృతిచెందారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,853కి చేరింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 14,278 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,08,82,798 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ కేసుల రేటు 96.9 శాతం ఉంది. ప్రస్తుతం 1,88,747 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇండియాలో కొత్తగా 5,37,764 టెస్టులు చేశారు. మొన్నటి కంటే అవి 6,00,066 తక్కువ. మొత్తం టెస్టుల సంఖ్య 22,19,68,010కి చేరింది.

    Related Stories