More

    కరోనా టీకా వేయించుకుంటే కంటి చూపు వచ్చేసిందట.. ఆమె చెప్తోంది నిజమేనా..!

    భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 35 కోట్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్ వేసి భారత్ మరింత ముందుకు వెళుతోంది. ఇంకొంత మంది వ్యాక్సిన్ పై ఉన్న అపోహల కారణంగా దీనికి దూరంగా ఉంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే వచ్చే ప్రయోజనాలను.. కరోనా మహమ్మారిని అంతం చేయొచ్చు అనే విషయాన్ని వారికి చెబుతున్నారు ఆరోగ్య కార్యకర్తలు. అలా కొందరిలో మార్పులు కూడా వస్తున్నాయి.. వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇక కరోనా టీకాలు వేయించుకున్న వారికి జ్వరం కూడా దరి చేరడం లేదని.. తమలో ఉన్న కొన్ని అనారోగ్య సమస్యలు కూడా దూరం అయినట్లు చెబుతూ వస్తున్నారు. అయితే ఓ మహిళ కరోనా వ్యాక్సిన్ వేయించుకోగా.. ఏకంగా కంటి చూపు తిరిగి రావడం.. మెడికల్ మిరాకిల్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన కథనాలు జాతీయ మీడియాలో వచ్చాయి.

    ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఒక మీడియా సంస్థ న్యూస్ రిపోర్ట్ కథనం ప్రకారం మహారాష్ట్ర వాషిమ్ కు చెందిన 70 ఏళ్ల మధురాబాయి బిద్వే కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన దృష్టిని తిరిగి పొందారని చెప్పారు. 9 సంవత్సరాల క్రితం కంటిశుక్లం కనుపాప ఐరిస్ తెల్లగా మారడంతో మధురాబాయి ఆమె రెండు కళ్ళలోనూ దృష్టిని కోల్పోయింది. ప్రస్తుతం తన బంధువులతో నివసిస్తున్న మధురాబాయి జూన్ 26 న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకుంది. టీకా తీసుకున్న మరుసటి రోజు, ఆమె ఒక కన్ను నుండి 30 నుండి 40 శాతం కంటి చూపును పొందిందని చెబుతోంది. మహిళ వాదన నిజమో కాదో వైద్యులు ఇంకా ధృవీకరించలేదు. పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. రెండు కళ్ళు కనిపించడం లేదని ఇన్ని రోజులూ చెప్పిన మధురాబాయికి ఇప్పుడు కళ్లు కనిపిస్తాయని చెబుతోంది. మధురాబాయి జల్నా జిల్లాలోని పార్తూర్ నివాసి. ఆమె తన బంధువులతో కలిసి రిసోడ్ తహసీల్‌లో నివసిస్తోంది. ఆమె గురించి వైద్యులు ఏమని చెబుతారో తెలియాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories