National

తీవ్ర విమర్శలు.. ఎట్టకేలకు వెనక్కు తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..!

ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి అజిత్ పవార్ సామాజిక మాధ్యమాల నిర్వహణ కోసం భారీగా ఖర్చు పెట్టాలని భావించిన సంగతి తెలిసిందే..! ఏకంగా 5.98 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకోగా.. తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కరోనా మహమ్మారి కట్టడికి ప్రజల డబ్బులను ఉపయోగించకుండా.. ఇలా పి.ఆర్. టీమ్ కోసం వినియోగిస్తారా అంటూ సామాన్యులు ప్రశ్నించారు. ఈ తీవ్ర వ్యతిరేకత చూసిన ఉద్ధవ్ థాక్రే సర్కారు ఎట్టకేలకు వెనక్కు తగ్గింది.
అజిత్ పవార్ సామాజిక మాధ్యమాల నిర్వహణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీని నియమించింది. అందుకోసం రూ.6 కోట్ల నిధులను కేటాయించింది. ఎందుకు ఈ నిధులు అనుకుంటున్నారా.. ఆయన తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయడానికట..! సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ మూసలే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం 2021–2022కు గానూ అజిత్ పవార్ సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించేందుకు ఏజెన్సీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లను సదరు ఏజెన్సీనే చూసుకుంటుంది. వాట్సాప్, టెలీగ్రామ్, ఎస్ఎంఎస్ లకు సంబంధించిన వ్యవహారాలనూ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వంలోని మంత్రుల సోషల్ మీడియా అకౌంట్లను చూసుకోడానికి డీజీఐపీఆర్ శాఖ ఉంది. ఆ శాఖ కోసం రూ.150 కోట్లూ ఖర్చు చేస్తోంది. ఈ శాఖలో వారికి సరైన నైపుణ్యాలు లేవని చెప్పి మరీ కొత్త ఉత్తర్వులను జారీ చేయడంతో ప్రతి పక్షాలు, సామాన్య పౌరులు కూడా విమర్శల వర్షాన్ని కురిపించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ కొత్త ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించిందనే విమర్శలు ఓ వైపు వెంటాడుతూ ఉన్నాయి. ఇవేవీ పట్టనట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసమే ఏకంగా 5.98 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని భావిస్తూ ఉండడాన్ని చాలా మంది తప్పుబట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 2 =

Back to top button