జైళ్లలో ఇకపై మహా మృత్యుంజయ, గాయత్రి మంత్రాలను ప్లే చేయనున్నారు

0
848

లక్నో: ఇక నుంచి జైళ్లలో మహామృత్యుంజయ్ మంత్రం, గాయత్రీ మంత్రాలు వినిపిస్తాయి. ఖైదీల మానసిక ప్రశాంతత కోసం ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. జైళ్లలో మహామృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం పఠించాలని జైళ్ల శాఖ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి ఆదేశించారు. ధరమ్‌వీర్ ప్రజాపతి ఆదేశాల మేరకు యూపీలోని జైళ్లలో మహామృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రాల పఠనం ప్రారంభమైందని అధికారులు కూడా వివరణ ఇచ్చారు.

మహామృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం పఠించడం వల్ల ఖైదీలకు మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మంత్రులతో సమావేశమై 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని కోరారు. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం యోగి మాట్లాడుతూ.. “ఉత్తరప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశంలోనే నంబర్‌ వన్‌గా మార్చడమే ముందున్న లక్ష్యమని” అన్నారు. “లక్ష్యాలను నిర్దేశించేటప్పుడు ఆచరణాత్మక, ఆర్థిక అంశాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి” అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, శ్రేయస్సు గురించి చర్చిస్తూ, “అన్ని శాఖలు వివరణాత్మక మరియు ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, 100 రోజులు, 6 నెలలు, వార్షిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి” అని సిఎం యోగి అన్నారు. ప్రజల జీవితాలు సాఫీగా ముందుకు సాగాలని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పథకాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.74 లక్షల మంది విద్యార్థులకు టాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీన్ని 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేర్చాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం తన సంకల్ప్ పత్రలో 2 కోట్ల మంది యువతకు ట్యాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్‌లను అందించి వారిని సాంకేతికంగా డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం తన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో తొలివిడతగా 9.74 లక్షల టాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్‌లను అందజేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.