ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డికి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. సీబీఐ కోర్టు రాఘవరెడ్డికి ఈ నెల 28 వరకు కస్టడీ పొడిగించింది. ఈడీ కోరిక మేరకు న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఈడీ నేడు కోర్టుకు తెలిపింది. మరింత సమాచారం రాబట్టేందుకు వీలుగా రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని లిక్కర్ స్కాం కేసులో ఈడీ గత నెల 10వ తేదీన అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రాఘవరెడ్డి ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నారు.