More

    మూడు నెలల వ్యవధిలో మాజీ ఎంపీ మాగంటి బాబు ఇద్దరు కుమారుల మరణం

    టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో రవీంద్రనాథ్ చౌదరి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మాగంటి బాబు పెద్దకుమారుడు రాంజీ ఇటీవలే కన్నుమూయగా.. ఇప్పుడు రెండో కుమారుడు కూడా చనిపోవడంతో మాగంటి బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రవీంద్రనాథ్ చౌదరి ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి మధ్యలోనే ఆయన వచ్చేసినట్టు సమాచారం. అప్పటినుంచి హైదరాబాదులోని స్టార్ హోటల్లోనే ఉంటున్నారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో కుమారుడు మరణించడం పట్ల ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్తపు వాంతులు చేసుకున్న స్థితిలో రవీంద్రనాథ్ చౌదరి మృతదేహాన్ని గుర్తించారు. మాగంటి బాబు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    ex mp maganti babus younger son ravindra died in hyderabad hotel

    టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాగంటి బాబు కుమారుడు రవీంద్ర మృతి బాధాకరమని అన్నారు. రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మాగంటి బాబు ఇప్పటికే ఒక కుమారుడ్ని పొగొట్టుకుని పుత్రశోకంతో ఉన్నారని, ఇప్పుడు ఆయన మరో కొడుకును కూడా కోల్పోవడం చూసి గుండె బరువెక్కిందని అన్నారు.

    రవీంద్రనాథ్ చౌదరి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు చనిపోయాడన్న మరణవార్తతో దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో ఉన్న మాగంటి బాబు కుటుంబంలో రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు వివరించారు.

    మాగంటి బాబు ఇంట మరో విషాదం.. రెండో కొడుకు మృతి..!

    తాగుడు అలవాటునుమానేందుకు రవీంద్రనాథ్‌ కు చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్‌ చేశారని.. మద్యానికి బానిస అయిన రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబసభ్యులు చేర్పించారట.. ఆసుపత్రి నుంచి తప్పించుకుని హోటల్‌లో ఉంటున్నాడని కూడా చెబుతున్నారు.

    Trending Stories

    Related Stories