National

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాగానే ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు

మధ్యప్రదేశ్‌లోని కట్నీ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు పూనుకున్నారు. ఇదే అంశంపై విచారణ జరుగుతోంది. “సర్పంచ్ ఎన్నికల్లో ఒక గుంపు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేశారంటూ మాకు ఫిర్యాదు అందిందని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారని, ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని విచారణ చేపట్టామని CSP విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. .

కట్ని జిల్లాలోని చాకా గ్రామంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలో కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. వీడియోలో 30-40 మంది నినాదాలు చేస్తూ కనిపించారు. వైరల్ అయిన వీడియోలో గెలిచిన అభ్యర్థి మద్దతుదారులు ‘ జీత్ గయా భాయ్ జీత్ గయా పాకిస్తాన్ జీత్ గయా’ అనే నినాదాలు చేయడం కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రెండో దశ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Related Articles

Back to top button