బ్రాహ్మణ వేషధారణలో ముస్లిం ఆషాడభూతి – చిత్ర హింసల పాలైన హిందూ యువతి

0
741

జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా..అన్నారు పెద్దలు. సత్ బ్రాహ్మణునికి ఈ వాక్కులు సరిపోతాయి. అయితే, ఆషాఢభూతి ఇస్లామీయుడు గోముఖ వ్యాఘ్ర రూపంలో హైందవ జాతి పంచన చేరాడు. హిందూ సదాచార యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కానిపనులకు పాల్పడాలని, ఇస్లాం మతంలోకి మారాలని ఆమెని చిత్ర హింసలకు గురిచేశాడు.

మధ్యప్రదేశ్‌ షాజాపూర్ జిల్లా షుజల్‌పూర్ ప్రాంతంలో షేక్ జాహిద్ అనే ముస్లిం వ్యక్తి బ్రాహ్మణుడిగా వేషం మార్చాడు. తాను విప్రుడినని అందర్ని నమ్మించి, ఓ హిందూ యువతితో పరిచయం పెంచుకున్నాడు. అయితే, ఆ మేక వన్నె పులి నిజస్వరూపం తెలుసుకున్నాక ఆమె అవాక్కయ్యింది. లైంగిక వేధింపులకు గురిచేసిన జాహిద్, ఆమెను బలవంతపు వివాహం చేసుకున్నాడు. అనంతరం, బిడ్డను కన్న ఆ పిచ్చితల్లికి మౌనమే శరణ్యమైంది. ఏడేళ్లుగా ఆమె కుమిలి కృశించిపోతోంది.

కర్కశ హృదయుడైన షేక్ జాహిద్ ఆమెను ఇంకా హింసించాలని నిర్ణయించుకున్నాడు. బ్రాహ్మణ యువతిని మాంసం తినమని, ఇస్లాం మతం లోకి మారమని బలవంతం చేశాడు. నమాజ్ చేయకపోతే గొంతు కోస్తానని బెదిరింపులు మొదలెట్టాడు. అయినా, ఆమె ససేమిరా అనడంతో..దారుణంగా దండించడం ప్రారంభించాడు.

ఎట్టకేలకు ఆ మహిళ మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మతపర గుర్తింపును దాచిపెట్టి, ఏడేళ్లపాటు హిందూ యువతిపై దారుణాలకు పాల్పడిన షేక్ జాహిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం కింద చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రమేయంవున్న జాహిద్ సోదరుడు సాజిద్‌పైనా కేసు నమోదు చేశారు.

తొలి వివాహం విఫలమైనప్పుడు జీవనాధారం కోసం భోపాల్ లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేదానినని బాధితురాలు తెలిపింది. అప్పుడు తాను బ్రాహ్మణ కులస్థుడినని పరిచయం చేసుకుని షేక్ జాహిద్ తనతో పరిచయం పెంచుకున్నాడని, కష్టాల్లో వున్న తనను మాటలతో మభ్యపెట్టి..స్నేహాన్ని పెంచుకున్నాడని. మధ్యప్రదేశ్‌ షాజాపూర్ జిల్లా దబ్రీపురా ప్రాంతానికి చెందిన ముస్లిం మతస్థుడు షేక్ జాహిద్ అనే విషయం వెల్లడైందని చెప్పింది. చివరకు తన జీవితాన్ని చిందర వందర చేసేశాడని ఆమె కళ్లనీళ్ల పర్యంతం అయ్యింది. కొర్టు వివాదం సమయంలో జాహిద్ బండారం బయటపడిందని ఆమె తెలిపింది.

బాధితురాలు నగరంలోని పలు హిందూ సంస్థలను సంప్రదించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందూ సంస్థ సభ్యులు ఆమెకు అండగా వున్నారు. ఫిర్యాదు అందుకున్న షుజల్‌పూర్ సిటీ పోలీసులు నిందితులపై చర్యలకు ఉపక్రమించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

ten − seven =