More

    కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్‌పై మహిళపై అత్యాచారం, వేధింపుల కేసు నమోదు

    కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్‌పై కేసు నమోదైంది. ధార్ జిల్లాలోని గాంధీవాణి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సింఘార్ మహిళపై అత్యాచారం, మానసికంగా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. “ఎమ్మెల్యే సింఘార్‌పై భారత శిక్షాస్మృతిలోని 376 (అత్యాచారం), 377 (అసహజ నేరాలు), 498 (ప్రలోభపెట్టడం లేదా తీసుకెళ్లడం లేదా నేరపూరిత ఉద్దేశ్యంతో నిర్బంధించడం) కింద ధార్‌లోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేయడమే కాకుండా.. వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

    మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన సింఘార్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్‌కు సన్నిహితుడు. అయితే ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని ఉమంగ్ సింఘార్‌ చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూసే ఇది నిజం కాదని అంటోంది. సింఘార్‌పై తప్పుడు కేసు పెట్టారని.. బీజేపీలో చేరేందుకు డబ్బు ఆఫర్ చేయగా.. ఆ విషయాన్ని బహిర్గతం చేయడంతో బీజేపీ అతడిని టార్గెట్ చేసిందని మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories