స్విమ్మింగ్ లో సూపర్ అనిపించుకుంటూ.. పతకాలు సాధిస్తున్న మాధవన్ కుమారుడు

ప్రముఖ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ (16) స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోని బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ‘47వ జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్స్ 2021’లో ఏడు పతకాలు గెలుచుకున్నాడు. ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్, 1500 మీటర్ల ఫ్రీ స్టైల్, 4X200 ఫ్రీ స్టైల్ రిలోలో రజత పతకాలు సాధించగా, 100, 200, 400 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు అందుకున్నాడు. ఈ పోటీల్లో కర్ణాటక చాంపియన్‌గా నిలిచింది. మార్చిలో జరిగిన లాట్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా వేదాంత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.

మాధవన్ తన కుమారుడిని ముందు నుండి ఆటల్లో ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. మాధవన్ తన కుమారుడి ప్రయత్నాలకు ఎల్లప్పుడూ మద్దతునిస్తూ, అభినందిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తన కొడుకు చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. గొప్ప విజయాలను సాధించినందుకు మాధవన్ తన కుమారుడి టీమ్ ను అభినందించాడు.
ఆగస్ట్‌లో వేదాంత్ 16వ పుట్టినరోజున మాధవన్ తనను తాను “బ్లెస్డ్ ఫాదర్” అని చెప్పుకొచ్చాడు. ప్రతిదానిలో నన్ను ఓడించినందుకు మరియు ఇంకా నన్ను అసూయపడేలా చేసినందుకు ధన్యవాదాలు.. నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది అంటూ కొడుకు గురించి చెప్పాడు. కొడుకువైనా నీ దగ్గర చాలా నేర్చుకోవాలి.. నీకు 16వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చగలవని ఆశిస్తున్నాను.. అని మాధవన్ తెలిపాడు. “Thank you for beating me at almost everything I am good at and making me jealous yet, my heart swell with pride. I have to learn so much from you my boy. As you step into the threshold of manhood, I want to wish you a very happy 16th birthday and hope and pray that you’re able to make this world a better place than we are able to give to you. I’m a blessed father.” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు మాధవన్.
మాధవన్ కుమారుడు వేదాంత 7 పతకాలు సాధించడంతో రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి అతనిపై ప్రశంసలు కురిపించారు. వేదాంతను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆద్భుతమైన ఆటతీరుతో రాణించినందుకు వేదాంత్ ను అభినందించారు. “మీ పెంపకం గురించి మేము గర్విస్తున్నాం” మాధవన్ ను పొగుడుతూ ట్వీట్లో పేర్కొన్నారు. పలువురు మాధవన్ ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. మాధవన్ 2020లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నిశ్శబ్దం సినిమాలో కనిపించాడు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ లో టైటిల్ రోల్లో నటిస్తున్నాడు.