స్విమ్మింగ్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మాధవన్ కుమారుడు

0
838

నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ డెన్మార్క్ ఓపెన్- 2022లో స్విమ్మింగ్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వేదాంత్ 800 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్‌లో 8:17.28 నిమిషాలతో పతకాన్ని గెలుచుకున్నాడు. మాధవన్ తన కుమారుడు ప్రైజ్ అందుకున్న క్లిప్‌ను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు.

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో క్లిప్‌ను షేర్ చేస్తూ, “గోల్డ్….మీ అందరి దీవెనలతో, దేవుని ఆశీస్సులతో విజేతగా నిలిచాడు. ఈరోజు వేదాంత్మాధవన్‌కి ఇది 800 మీటర్ల స్విమ్మింగ్ లో బంగారు పతకం. ఇది నన్ను ఎంతో ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. ఆనందంతో తన్మయత్వం చెందేలా చేస్తోంది” అని మాధవన్ పోస్టు పెట్టారు. పోస్ట్‌లో వేదాంత్ కోచ్, స్విమ్మింగ్ ఫెడరేషన్, మొత్తం జట్టుకు కృతజ్ఞతలు తెలిపారు మాధవన్. ఆర్ మాధవన్ ఈ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే అభిమానులు, పరిశ్రమ స్నేహితులు, అభిమానులు తాము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలిపారు.

శనివారం అదే స్విమ్మింగ్ ఈవెంట్‌లో వేరే విభాగంలో మాధవన్ కుమారుడు రజత పతకాన్ని సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో పతకాన్ని గెలుచుకున్నాడు. 15:57:86 నిమిషాలలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. “కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్‌లో వేదాంత్ మాధవన్ భారతదేశానికి రజతం అందించాడు. మాకు చాలా గర్వంగా ఉంది.” అని మాధవన్ పోస్ట్ పెట్టారు.

R మాధవన్ కుమారుడు వేదాంత్ అనేక అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాంస్యం నుండి స్వర్ణం వరకు, అతను వివిధ విభాగాలలో అనేక అవార్డులను గెలుచుకున్నాడు. ఆర్ మాధవన్ “రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌” సినిమాలో కనిపించబోతున్నాడు. మాజీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాతో మాధవన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రం జూలై 1, 2022న థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేయబడింది.