More

    లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అవ్వడంపై మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    బాలీవుడ్ సినిమాలు ఇటీవలి కాలంలో వరుసగా ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. పలు సినిమాలను బాయ్ కాట్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ తీస్తున్న సినిమాలు.. భారత్ కు వ్యతిరేకంగా కొందరు ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా సినిమాలను చూడకుండా ఉండాలనే ఎక్కువగా సినీ అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ సినిమాలు మంచి కంటెంట్ ను అందించకుండా పోతుండడంతో.. దక్షిణాది సినిమాలు బాగుండడంతో బాలీవుడ్ సినిమాలకు గడ్డు కాలం మొదలైంది. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలను కూడా సినీ ప్రియులు పట్టించుకోవడం లేదు.

    భారీ అంచనాలతో వచ్చిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇదే సమయంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథతో మాధవన్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన ‘రాకెట్రీ’ సినిమా విజయవంతమైంది. మొదట రాకెట్రీ సినిమాకు తక్కువ థియేటర్లు దక్కగా.. ఆ తర్వాత క్రమం క్రమంగా భారీగా జనం వెళ్లి చూసారు. ఈ నేపథ్యంలో ‘లాల్ సింగ్ చద్దా’ ఫ్లాప్ కావడం… ‘రాకెట్రీ’ హిట్ కావడంపై మాధవన్ స్పందించారు. ప్రతి ఒక్కరూ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే సినిమాను నిర్మిస్తారని.. ఒక ఫెయిల్యూర్ సినిమాను తీయబోతున్నామనే భావనతో ఎవరూ సినిమా తీయరని అన్నారు. అన్ని సినిమాలకు కష్టపడిన విధంగానే ‘లాల్ సింగ్ చద్దా’కు కూడా కష్టపడ్డారని చెప్పారు. ప్రేక్షకులు ఇప్పుడు ప్రపంచ సినిమా స్థాయికి వెళ్లిపోయారని తెలిపారు. తన సినిమా ‘రాకెట్రీ’ విషయానికి వస్తే ఇదొక బయోపిక్ అని… ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా ఆడతాయని చెప్పారు. కరోనాకు ముందులా ఇప్పుడు ఆడియన్స్ లేరని… వారిలో మార్పు వచ్చేసిందని అన్నారు. థియేటర్లలో సినిమాలు ఆడేలా స్క్రీన్ ప్లేను పక్కాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారని మాధవన్ అన్నారు. దక్షిణాది సినిమాల గురించి మాట్లాడితే… బాహుబలి 1, బాహుబలి 2, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ స్టార్ల సినిమాల కంటే బాగా ఆడాయని చెప్పారు. కరోనాకు ముందు ప్రేక్షకులు ఒక ఇండస్ట్రీకి చెందిన సినిమాలను మాత్రమే చూస్తుండేవారని… కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సినిమాలను చూసేందుకు అలవాటు పడ్డారని తెలిపారు. అందువల్ల వారికి నచ్చే సినిమాను చేస్తేనే ఆ సినిమా ఆడుతుందని అన్నారు మాధవన్.

    మాధవన్ ప్రస్తుతం ‘ధోకా రౌండ్ డి కార్నర్‌’ అనే సినిమాలో పని చేస్తూ ఉన్నాడు. రాకెట్‌రీని రూపొందించడానికి తన శక్తియుక్తులన్నింటినీ పెట్టుబడిగా పెట్టిన తర్వాత, తాను తిరిగి నటించడానికి సమయం వచ్చిందని చెప్పాడు. “నేను నంబి నారాయణన్‌గా అలసిపోయాను, నేను గత ఆరేళ్లుగా దాని చుట్టూ తిరుగుతున్నాను. కాబట్టి, దర్శకత్వం వహించడం, నటించడం, నిర్మించడం.. ఇలా ఒక ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న తర్వాత, నేను మళ్లీ నటుడిగా మారవలసి వచ్చింది.” అని చెప్పుకొచ్చాడు. కూకీ గులాటి దర్శకత్వం వహించిన ధోకా రౌండ్ D కార్నర్ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది.

    spot_img

    Trending Stories

    Related Stories