More

  భారత ప్రధాని జగన్..?! మరి, రాష్ట్రపతి ఎవరో తెలుసా..? మదర్సా చదువులా మజాకా..!

  భారత దేశానికి ప్రధానమంత్రి ఎవరో తెలుసా..? వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. ఏంటి షాకయ్యారా..? ఆగండాంగండి.. మతేమైనా భ్రమించిందా..? అని తిట్టుకునేరు. మన ప్రధాని నరేంద్ర మోదీ అని నాకు తెలుసు. నాకే కాదు.. అక్షరజ్ఞానం వున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంతోమంది చదువురాని వాళ్లకూ తెలుసు. అయితే, నెల్లూరులోని ఓ స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మాత్రం తెలియదు. తాజాగా ఓ విలేకరి.. ఆ విద్యార్థుల తెలివితేటల్ని కనుక్కుందామని ప్రయత్నించి కళ్లు తేలేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఎనలేని హాస్యాన్ని పంచుతోంది.

  తాజాగా ఆంధ్రప్రదేశ్‎లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మదర్సా పాఠశాల విద్యార్థులు ఢిల్లీలోని ఇండియా గేట్‎ను వీక్షించేందుకు వెళ్ళారు. విద్యార్థులతో పాటు వారి పెద్దలు కూడా పక్కనే వుండి టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దృశ్యం ఓ విలేకరి కంటపడింది. వెంటనే ఆ విద్యార్థుల తెలివితేటల్ని తెలుసుకునేందుక ప్రయత్నించాడు. మొదట పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించాడు. దానికి మదర్సాలో చదువుతున్నానని సదరు విద్యార్థి బదులిచ్చాడు. ఆ తర్వాత మన దేశానికి ప్రధానమంత్రి ఎవరని అడిగాడు. ఈ ప్రశ్నకే ఏదో సివిల్స్ ఎగ్జామ్స్‎లో ఫైనల్ పేపర్ లోని క్వశ్చన్ అడిగినట్టు.. తెల్లమొహం పెట్టాడా విద్యార్థి. అటూ ఇటూ చూస్తూ పక్కవారిని అడిగే ప్రయత్నం చేశాడు. దీంతో మరోసారి విద్యార్థిని అదే ప్రశ్న వేయగా ఏం చేయాలో తెలియక ‘జగన్’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఖంగుతిన్న విలేకరి కాసేపటికి తేరుకుని.. ఈ విషయాలు మీకు స్కూల్లో నేర్పలేదా అని ప్రశ్నించాడు. నో ఆన్సర్. ఇక లాభం లేదనుకుని.. పక్కనేవున్న.. ఢిల్లీలోని ఓ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థికి అదే ప్రశ్నవేశాడు. మన ప్రధాని ఎవరని. అంతే, మోదీ అంటూ ఆ బుడతడు ఠక్కున సమాధానం చెప్పాడు.

  ఆ తర్వాత, నెల్లూరు నుంచి వచ్చిన ఇతర మదర్సా విద్యార్థులను కూడా ఇదే ప్రశ్న అడిగినా.. ఏ సమాధానమూ ఇవ్వలేకపోయారు. దేశ అత్యున్నత పదవులైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరు అంటే.. ఏ ఒక్కరూ సమాధానమివ్వలేక బిక్కచూపులు చూశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో నెటిజన్లు మదర్సా స్కూల్ విద్యపై ఛలోక్తులు విసురుతున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్నా.. భావి భారత పౌరుల తెలివితేటలు ఆందోళన కలిగిస్తున్నాయి. మదర్సాల్లో నేర్పే విద్య కేవలం మతపరంగా ఉండటంతో.. దేశానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఉండటం లేదు. సైన్స్, సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్టుల్లో నైపుణ్యం పూర్తిగా కొరవడుతోంది.

  నేటి బాలలే రేపటి పౌరులు. బాలలకు మెరుగైన విద్యనందిస్తే పరిపూర్ణమైన భావిభారత పౌరులుగా ఎదుగుతారు. అందుకే నేర్పించే విషయంలో ఎలాంటి భేదభావాలు ఉండకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తేరుకుని, మత ప్రాతిపదకన సాగే విద్యా విధానాన్ని నిషేధించాల్సిన అవసరం వుంది. అన్ని మతాల విద్యార్థులకు ఒకే రకమైన విద్యాబోధన జరిగినప్పుడే బాలలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారిలో దేశం పట్ల భక్తి, గౌరవం ఏర్పడతాయి.

  Trending Stories

  Related Stories