లక్నో గర్ల్.. రాఖీ కట్టి..!

‘లక్నో ట్రాఫిక్ గర్ల్’.. ప్రియదర్శిని యాదవ్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ తో ఉన్న శత్రుత్వానికి, గొడవలకు ది ఎండ్ కార్డ్ పెట్టాలని అనుకుంది. జూలై 30 రాత్రి లక్నోలోని రద్దీగా ఉండే వీధుల్లో క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీపై దాడి చేసింది. రాఖీ కట్టి సమస్యను పరిష్కరించడానికి ఆమె స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఆమె సాదత్ అలీకి రాఖీ కట్టాలని భావిస్తోంది. అతను తన ఇంటికి వస్తే సోదరుడిగా స్వాగతిస్తానని, అతనికి రాఖీ కట్టడం ద్వారా కొత్త సంబంధాన్ని ప్రారంభిస్తానని చెప్పింది.
ఆగస్టు 3 న బాధితుడి స్టేట్మెంట్ ఆధారంగా ప్రియదర్శిని యాదవ్‌పై లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లక్నోకు చెందిన ప్రియదర్శిని గత జూలై 30న రాత్రి క్యాబ్ డ్రైవర్ ను కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు అదే యువతి మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ప్రియదర్శిని రక్షాబంధన్ సందర్భంగా ఆ క్యాబ్ డ్రైవర్‌కు రాఖీ కట్టి నాడు అతనితో జరిగిన గొడవ పూర్తిగా సమసిపోయేలా చేయాలని అనుకుంది. ఇందుకోసం ఆమె తమ ఇంటిని అందంగా అలంకరించి, ప్రత్యేకమైన స్వీట్లు కొనుగోలు చేసి, ఆ డ్రైవర్‌కు సాదరంగా ఆహ్వానం పలికింది.
సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్ డ్రైవర్ వాహనం నడుపుతూ, రోడ్డు దాటుతున్న ఆమెకు సమీపంగా వచ్చాడు. దీంతో ఆమె డ్రైవర్ తనను ఢీకొట్టబోయాడని ఆరోపిస్తూ, అతనిపై విచక్షణరహితంగా దాడిచేసింది. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని కూడా కొట్టింది. అయితే పోలీసులు ఈ ఉదంతంపై సాగించిన దర్యాప్తులో అసలు నిజం వెల్లడయ్యింది. ఆ యువతే ప్రమాదకరంగా రోడ్డును దాటుతున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఫలితంగా క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన ఆ యువతిదే తప్పని నిర్ధారణ అయ్యింది. “ఆమె కారులోంచి నా ఫోన్‌ని లాక్కొని ముక్కలుగా ముక్కలు చేసింది. ఆమె కారు సైడ్ మిర్రర్లను కూడా పగలగొట్టింది ”అని బాధితుడు సాదత్ అలీ సిద్ధిఖీ సంఘటన తర్వాత మీడియాతో చెప్పాడు. తన కారు డ్యాష్‌బోర్డ్‌లో ఉంచిన తన డబ్బును కూడా అమ్మాయి దొంగిలించిందని అతను చెప్పాడు. మేమిద్దరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లబడ్డాము, అక్కడ నాపై FIR నమోదు చేయబడింది కానీ ఆమెపై ఏమీ చేయలేదు. నాకు న్యాయం కావాలి అని క్యాబ్ డ్రైవర్ మీడియాను కోరాడు.