More

    బురఖా ధరించిన మహిళ వీపుపై పార్టీ స్టిక్కర్‌ను అంటించిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త

    సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త బురఖా ధరించిన మహిళ వెనుక భాగంలో పార్టీ స్టిక్కర్‌ను అతికిస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. ఈ వీడియోను తొలుత షానవాజ్ అన్సారీ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా, కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది.

    ఎస్పీకి చెందిన అర్మాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లక్నో వెస్ట్ అసెంబ్లీ స్థానంలో ఈ వీడియో తీసినట్లు చెబుతున్నారు. వీడియోలో, ఎస్పీ కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం చేస్తూ మార్కెట్‌లో తిరుగుతూ కనిపించారు. స్లీవ్‌లెస్ బ్రౌన్ జాకెట్, తెల్లటి చొక్కా ధరించిన ఒక వ్యక్తి బురఖా ధరించిన మహిళ వద్దకు వెళ్లి ఆమె వీపుపై పార్టీ స్టిక్కర్‌ను అతికించాడు.

    https://twitter.com/indiantweeter/status/1491304971190829056

    ఆ మహిళ తన వీపుపై ఏదో తగిలినట్లు, ఏమి జరుగుతుందో తనిఖీ చేయడానికి తిరిగింది. ఆమె ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ వ్యక్తి ఆమె చేతిని తాకడానికి ప్రయత్నించగా..అందుకు ఆమె ప్రతిఘటించింది. దీంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మహిళ వెనుదిరిగి, తన వీపుపై ఏదో ఉందేమోనని తనిఖీ చేసేందుకు ప్రయత్నించింది కానీ స్టిక్కర్‌ని అందుకోలేకపోయింది.

    యూపీ అసెంబ్లీ ఎన్నికలు:
    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో పూర్తవుతాయి. మార్చి 7న చివరి దశ పోలింగ్ జరుగుతుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2017 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని బృందం 403 సీట్లలో 325 స్థానాల్లో విజయం సాధించింది.

    Trending Stories

    Related Stories