Sports

టోక్యో ఒలింపిక్స్.. భారత్ కు మరో పతకం గ్యారెంటీ..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటికి కేవలం ఒకే ఒక రజతంతో సరిపెట్టుకోగా.. మరో పతకం భారత్ ఖాతాలో రానుంది. యువ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్‌లో భాగంగా చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్‌పై 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆమెకు పతకం ఖాయమైంది. స్వర్ణానికి రెండు బౌట్ల దూరంలో నిలిచిన లవ్లీనా తర్వాతి మ్యాచ్ లో ఓడినా కాంస్యపతకం లభించనుంది. లవ్లీనా సెమీస్‌లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి అయిన టర్కీ క్రీడాకారిణి బుసెనాజ్ సుర్మెనేలితో ఆగస్టు 4న తలపడుతుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఒక్క పతకమే దక్కింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీ విభాగంలో దేశానికి తొలి పతకం (రజతం) అందించింది.లవ్లీనా ఇద్దరు అక్కలైన కవలలు లిచా, లిమా కూడా బాక్సర్లే కావడం విశేషం. 2017లో ఆసియన్ చాంపియన్‌షిప్, 2018లో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో లవ్లీనా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2020లో ఆసియా అండ్ ఓసియానా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో విజయం సాధించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ సంపాదించుకుంది. ఒలింపిక్స్ లో అడుగు పెట్టిన లవ్లీనా దూసుకుపోతోంది.

మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ఓటమి పాలైంది. థాయిలాండ్‌కు చెందిన సుదాపోర్న్ చేతిలో 0-5 తేడాతో ఓటమిపాలైంది.

ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 8లో భాగంగా రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పెరోవాతో జరిగిన పోరులో దీపిక 6-5తో విజయం సాధించింది. ఐదు సెట్లలో దీపిక రెండు సెట్లను గెలుచుకోగా, పెరోవా రెండు సెట్లను దక్కించుకుంది. మరో సెట్ టై అయింది. దీపికకు స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. అనంతరం జరిగిన షూటవుట్‌లో రష్యాకు చెందిన పెరోవా ఏడు పాయింట్లు మాత్రమే సాధించింది. 10 పాయింట్లు సాధించిన దీపిక మ్యాచ్‌ను కైవసం చేసుకుని క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + 15 =

Back to top button