మావాణ్ణి పెళ్లిచేసుకో.. లేదంటే, ఊరొదిలి వెళ్లిపో.. జార్ఖండ్‎లో లవ్ జిహాద్..!

0
801

జార్ఖండ్‎లో మరో లవ్ జీహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ళ మైనర్ బాలికను కొందరు ఉన్మాదులు సొంతింటి నుంచే అపహరించారు. ఇంట్లో ఉన్న డబ్బును సైతం దోచుకెళ్లారు. తమ ప్రాంతంలో నివసించడం ఇష్టంలేదని బెదిరించినా వినకపోవడంతో,.. పట్టపగలే బాలికతో పాటు ఇంట్లోని బంగారం, నగదు అపహరించినట్లు తెలుస్తోంది.

ఇటీవల తన పదహారేళ్ళ కూతురుని కొంతమంది కిడ్నాప్ చేశారని హజారీబాగ్‎లో ఉన్న కెరెదారీ పోలీస్ స్టేషన్‎లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. షాహీద్ అన్సారీ, అర్బేజ్ అన్సారీ అనే ఇద్దరు కలిసి తన కూతురిని ఇంటి నుంచి అపహరించారని పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు దాఖలైంది. ఆ ఫిర్యాదు ప్రకారం.. షాహీద్ అన్సారీ, అర్బేజ్ అన్సారీలతో పాటు నలుగురు గుర్తుతెలియని సహచరులు నవంబర్ 4న మధ్యాహ్నం రెండుగంటల సమయంలో బాధితురాలి ఇంటివద్దకు వచ్చారు. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన నిందితులు ఇంట్లోకి చొరబడి బాలికను ఈడ్చుకెళ్లారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. మైనర్‌ను ఇస్లాం మతంలోకి మార్చాలని, షాహిద్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేందుకే ఈ అపహరణకు పాల్పడినట్లు తెలిపింది. అపహరణ సమయంలో ఇంట్లో ఉన్న 3 లక్షల 30 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు 25 వేల రూపాయల నగదును కూడా అపహరించుకెళ్ళారని చెప్పింది. అయితే షాహీద్ తమను గతంలో కూడా బెదిరించారని ఫిర్యాదులో ఆరు నెలల క్రితం తమ ప్రాంతంలో నివసిస్తున్నందుకు తాము చెప్పినట్లు నివసించాలని షాహీద్ బెదిరించాడని తెలిపింది. ఈ బెదిరింపుల్లో నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులు, స్థానిక అంజుమన్ ముస్లిమీన్ కమిటీకి చెందిన హబీబ్ మియాన్ కూడా కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి తెలిపారు. ఇక, మహిళ ఫిర్యాదుతో నిందితులపై సత్వర చర్యలు తీసుకోవాలంటూ స్థానిక హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ స్థానికంగా నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సంఘటనపై గతంలోనే ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే దేశంలో లవ్ జీహాద్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అమాయక హిందూ మహిళలను ప్రేమ పేరుతో వల వేసి అపహరించుకు పోవడం లాంటి సంఘటనలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఇటువంటి సంఘటనలను పోలీసులు అడ్డుకుని ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. కానీ సెక్యులర్ ముసుగులో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ ప్రమాదాన్ని గుర్తించకుండా మొద్దు నిద్రను నటిస్తున్నాయి. ఇప్పటికే యూపీ, కర్నాటక లాంటి బీజేపీ రాష్ట్రాలు ఈ లవ్ జీహాద్ లపై చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. కానీ ఇటువంటి చట్టాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చి అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లవ్ జీహాద్ పై ఆలోచించి సంపూర్ణ చట్టాలను రూపొందించాలని పలువురు కోరుకుంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × 5 =