National

బెంగళూరులో మరో సారి వింత శబ్దం

బెంగళూరులో మరోసారి భారీ శబ్దం వినిపించింది. గతేడాది లాగే శుక్రవారం కూడా పెద్ద శబ్దాలు వచ్చాయి. బెంగళూరు సౌత్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించిందని చెప్పారు. ఈ శబ్దం ధాటికి పలు భవనాల్లో అద్దాలు పగిలిపోయాయి. బొమ్మనహళ్లి, సిల్క్ బోర్డు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, పద్మనాభ నగర్, మహదేవపుర వంటి ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించింది. యుద్ధ విమానాలు సృష్టించే సోనిక్ బూమ్ అని గతంలో వెల్లడించారు. అది తమ సూపర్ సోనిక్ విమానం నుంచి వచ్చిన ధ్వని అని భారత వాయుసేన వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ భారీ శబ్దం వినిపించగా, ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఈసారి వచ్చిన శబ్దంపై బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్పందిస్తూ, అందుకు తమ విమానాలు కారణం కాదని స్పష్టం చేసింది. తన నుండి అసాధారణమైన కార్యకలాపాలు జరగలేదని తెలిపింది.

గత సంవత్సరం మేలో కూడా బెంగళూరులో గట్టిగా వినిపించింది. భారత వైమానిక దళం ఇది ఒక సూపర్ సోనిక్ యుద్ధవిమానం టెస్ట్ ఫ్లైట్ కారణంగా చోటు చేసుకుందని వెల్లడించింది. శుక్రవారం పెద్ద శబ్దం గురించి, డిసిపి సౌత్ మాట్లాడుతూ, “ఇది సోనిక్ బూమ్ లాగా ఉంది. భూమిలో ఎటువంటి ప్రకంపనలు లేవు. హెచ్ఏఎల్ లో గత రెండు రోజులుగా, తేజస్ సోర్టీలు జరుగుతున్నాయి. వారు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంది కూడా సోనిక్ బూమ్ లాగా ఉంది. మేము మా దళాలను పంపించాము, భూమిలో అయితే ఎటువంటి ప్రకంపనలు జరగలేదు” అని అధికారి తెలిపారు.

హెచ్ఏఎల్ ప్రతినిధి గోపాల్ సుతార్ మాట్లాడుతూ, “హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి క్రమం తప్పకుండా యుద్ధ విమానాలు మరియు శిక్షణా విమానాలు ఎగురుతూ ఉంటాయి. ఈ రోజు దీనికి భిన్నంగా ఏమీ చోటుచేసుకోలేదు. హెచ్ఏఎల్ ఈ ధ్వనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు” అని తెలిపారు.

నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద శబ్దం వినిపిస్తుందని చాలా మంది బెంగళూరు వాసులు ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చెప్పుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 12.23 గంటలకు ఈ శబ్దం వినిపిందని చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు తెలిపారు. కొంతమంది ఈ శబ్దానికి భయపడ్డామని చెప్పగా.. మరికొందరు ఇది సోనిక్ బూమ్ కాదా అని అడిగారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fifteen − 2 =

Back to top button