More

    క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి కన్నుమూత

    టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా మరణించారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. త్రిలోక్ చంద్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తమ సొంత నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ గతంలో భారత సైన్యంలో ఆర్డినెన్స్ విభాగంలో పనిచేశారు. ఆయన బాంబులు తయారుచేయడంలో నిపుణులు.

    తన తండ్రి మరణించిన ఒక రోజు తర్వాత సోషల్ మీడియాలో హృదయపూర్వక నివాళిని అర్పించారు. త్రిలోక్‌చంద్ రైనా క్యాన్సర్‌తో పోరాడి ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సురేష్ రైనా తన సపోర్ట్ సిస్టమ్‌ను కోల్పోయానని చెబుతూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.

    “నాన్నను పోగొట్టుకున్న బాధను వర్ణించలేము. మా నాన్నగారి మరణంతో, నేను నా సపోర్ట్ వ్యవస్థను, నాకు ఎప్పుడూ మద్దతు ఇచ్చే పిల్లర్ ను కూడా కోల్పోయాను. చివరి శ్వాస వరకు ఆయన నిజమైన పోరాట యోధుడు, మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి నాన్న. ఎప్పటికీ మిస్ అవుతారు” అని రైనా తన పోస్ట్‌లో తెలిపాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన రైనా 18 టెస్టులు, 226 ODIలు, 78 T20Iలు ఆడాడు. రైనా చివరిసారిగా 2018లో ఇండియా తరఫున ఆడాడు. MS ధోని తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు రైనా.

    MS ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను తమ 4 రిటెన్షన్ ప్లేయర్లుగా తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ రైనాను రిటైన్ చేయలేదు. బెంగుళూరులో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనున్న IPL 2022 వేలంలో 590 మంది షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్లలో రైనా తనను తాను రూ. 2 కోట్ల లిస్ట్ ఆటగాడిగా నమోదు చేసుకున్నాడు.

    Trending Stories

    Related Stories