More

    కార్తీక శోభ

    శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీకమాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది దీపావళి అమావాస్యనాడు సూర్యగ్రహణం పట్టిన విషయం తెలిసిందే. దీంతో దీపావళి పండుగను ఒకరోజు ముందే జరుపుకున్నారు. ఇక ప్రస్తుతం కార్తీక పౌర్ణమినాడు ఈ సారి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దీంతో కార్తీక పౌర్ణమి జరుపుకోవడంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కార్తీక సోమవారం రోజు పౌర్ణమి కలిసి వచ్చిన వేళ.. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు నదితీరాలకు తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. భక్తుల శివ నామస్మరణతో శివాలయాలు మార్మోగుతూ.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

    Trending Stories

    Related Stories