More

    భగవద్గీతలో కూడా జిహాద్ ఉంది: కాంగ్రెస్ సీనియర్ నేత

    ‘జిహాద్’ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ లోనే కాదు భగవద్గీతలో కూడా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ వ్యాఖ్యలు చేశారు. జిహాద్ భావన గీతలో ప్రస్తావించబడిందని..మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్‌పై పాఠాలు చెప్పాడని వ్యాఖ్యానించారు శివరాజ్ పాటిల్. ఇస్లాం మతంలో జిహాద్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని..జిహాద్ గురించి ఖురాన్ లోనే కాదు భగవద్గీతలో కూడా ప్రస్తావించబడిందని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్ర ఆవిష్కరణ సందర్భంగా శివరాజ్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ షిండే,శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. శివరాజ్ పాటిల్ 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా, 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు.

    Trending Stories

    Related Stories