పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తికమాస చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు శివ నామస్మరణలతో మార్మోగి పోయాయి. కార్తిక దీపాలతో శివాలయాలు శోభాయమానంగా వెలిగిపోయాయి. పలు ఆలయాలు భక్త జనం పోటెత్తారు. తెల్లావారుజామున నుంచే వేలాది మంది భక్తులు శివాలయాల్లో బారులు తీరి భక్తిశ్రద్దలతో పరమశివుని పూజలు చేశారు. నదీ తీరాన స్నానమాచరించి దీపాలను నదుల్లో వదిలారు. నగరంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో మహాశివునికి ప్రత్యక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివాలయంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ నిర్వాహాకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.