బుధవారం (జనవరి 5), హుస్సేనివాలా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లైఓవర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రాజకీయ నిరసనకారులను పంజాబ్ పోలీసులు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ భద్రతా ఉల్లంఘన విషయంలో స్థానిక గురుద్వారా భాగమైందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చిందని ‘ది ట్రిబ్యూన్’ మీడియా సంస్థ నివేదించింది.
జనవరి 6 నాటి తన నివేదికలో, ‘రైతులు ఫ్లైఓవర్‌ను అడ్డుకోవడంతో ఫిరోజ్‌పూర్ ర్యాలీని ప్రధాని మోదీ రద్దు చేశారు; కేంద్రం భద్రతా ఉల్లంఘన అని చెబుతోంది’ అంటూ తెలిపింది. అంతేకాకుండా హైవేపై అడ్డుగా నిలబడాలని ప్రజలను కోరుతూ ప్రక్కనే ఉన్న గురుద్వారా ప్రకటనలు చేసిందని తెలియజేసింది.
“సమీపంలోని గురుద్వారా నుండి ప్రకటనలు చేయబడ్డాయి, ఎక్కువ మంది రోడ్లపైకి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఫ్లైఓవర్‌కు అవతలి వైపు కూడా అడ్డుకుంటే ఆయన చిక్కుకుపోతారనే భయంతో SPG సిబ్బంది ప్రధానిని తిరిగి భటిండాకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది”.

న్యూస్ ట్రాక్ ప్రచురించిన ఒక నివేదికలో, ప్రధానమంత్రి ఇరుక్కుపోయారని స్థానిక గురుద్వారా నుండి తెలుసుకున్న తర్వాత ఎక్కువ మంది రైతులు హైవేని అడ్డుకోవడానికి తరలివచ్చారని మీడియా నివేదికలను ఉదహరించారు. “ట్రాఫిక్ జామ్ కారణంగా, ప్రధాని మోదీ కాన్వాయ్ 15 నుండి 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై ఇరుక్కుపోయింది. ఈ సమయంలో, సమీపంలోని గురుద్వారా నుండి ప్రధానమంత్రి చిక్కుకున్నట్లు ప్రకటన చేశారు. అది విని ఎక్కువ మంది అక్కడ గుమిగూడారు. అప్పుడు ప్రధాని మోదీ భద్రతకు ప్రమాదం ఉందని, ఎస్పీజీ బృందం ఆయనను అక్కడి నుంచి వెనక్కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది” అని నివేదికలో ఉంది.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. డ్రోన్ లేదా టెలిస్కోపిక్ గన్ తో ప్రధానిని చంపి ఉండవచ్చని వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ దయ కారణంగా ప్రధాని మోదీ తప్పించుకున్నారని గిరిరాజ్ సింగ్ అన్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత నేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం చేసిన తప్పును క్షమించరాదని అన్నారు.
ప్రధానికి రక్షణ చేపట్టడంలో విఫలమైన పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయపై వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రాను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే ఆ రాష్ట్రంలో కొత్త డీజీపీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్‌లో 100 రోజుల వ్యవధిలో డీజీపీ మార్పు చోటుచేసుకోవడం ఇది మూడోసారి. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి కనీసం రెండేళ్ల వరకూ అత్యున్నత పదవిలో ఉండనున్నారు. ఎంపానెల్‌మెంట్ కమిటీ ముగ్గురు అధికారులైన భావ్రా, రాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ దినకర్ గుప్తా, ఐపీఎస్ అధికారి ప్రబోధ్ కుమార్‌లను అత్యున్నత పదవికి సిఫార్సు చేసినట్లు పంజాబ్ గవర్నర్ ఒక ఉత్తర్వులో తెలిపారు.