బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. రాజీనామా చేసిన లిజ్ ట్రస్

0
782

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే ఆమె బాధ్యతల నుంచి వైదొలిగారు.

మినీ బడ్జెట్ ను ప్రధాని లిజ్ ఇటీవల ప్రవేశపెట్టారు. దీనిపై ట్రస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తప్పులు చేశాం క్షమించండి అని పార్లమెంట్ లో కోరిన మరునాడే ఆమె రాజీనామా చేశారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జరిగిన పొరపాట్లకు క్షమించండి. ఆర్థికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయని అన్నారు. ఆ పరిణామాలు చాలా వేగంగా.. చాలా దూరం వెళ్లాయి. అందుకు బాధ్యత నేనే తీసుకుంటున్నా. కాస్త సమయం ఇవ్వండి.. అన్నీ చక్కబెడతామని ఆమె వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.