లీసెస్టర్ దాడిపై గళమెత్తిన హిందువులు.. బ్రిటన్ ప్రభుత్వాన్ని కదిలించేలా లేఖ..!

0
769

లండన్‎లో రోజురోజుకీ మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి. అందునా హిందువులపై విద్వేషపూరిత దాడులు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ దాడుల్లో పాకిస్తానీ ఉగ్రవాదులు, ఖలిస్తానీ తీవ్రవాదుల హస్తం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బ్రిటన్ లాంటి అభివృద్ది చెందిన దేశాల్లో హిందువులు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ దాడులను నిరసిస్తూ బ్రిటన్‎లోని 180 హిందూ సంఘాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. తమకు భద్రత కల్గించాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.

లేఖలో ముందుగా బ్రిటన్ లో హిందువుల జీవితాన్ని గురించి ప్రస్తావించాయి. దేశంలో హిందూ జనాభా కేవలం రెండు శాతం మాత్రమే అయినా.. తాము బ్రిటన్ ఎకానమీకి ఎంతో తోడ్పడుతున్నామని పేర్కొన్నాయి. ఈ దేశంలో హిందువులు ఎంతో బాధ్యతతో నివసిస్తున్నారని.. బ్రిటన్ చట్టాలను కూడా హిందూ జనాభా గౌరవిస్తోందని తెలిపాయి. అందుకే తమ మతంలో నేరపూరిత లక్షణాలు కూడా తక్కువేనని హిందూ సంఘాలు స్పష్టం చేశాయి. బ్రిటన్ జైలు రికార్డులు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయన్నాయి హిందూ సంఘాలు లేఖలో పేర్కొన్నాయ. అయితే ఇంత బాధ్యతగా నివసిస్తున్న హిందువులపై బ్రిటన్‎లో ఇటీవల దాడులు బాగా పెరిగిపోతున్నాయని హిందూ సంఘాలు తెలిపాయి. ఇటీవలే లీసెస్టర్ హింసాకాండ, బర్మింగ్ హామ్ దేవాలయం దగ్గర నిరసనలు, వెంబ్లీలోని దేవాలయం వద్ద అల్లర్లు వంటివి తీవ్రంగా ఖండించదగినవని హిందూసంఘాలు చెప్పాయి. ఈ దాడులన్నీ హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసినవనేనని ప్రభుత్వం గుర్తించాలని ఆయా సంఘాలు కోరాయి. అయితే ఇలా రోజురోజుకీ హిందువులపై దాడులు పెరిగిపోతుండటాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాల్సిందిగా లేఖలో పేర్కొన్నాయి.

దీంతో పాటు తమకు బ్రిటన్ లో రక్షణ కల్పించడానికి.. ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరాయి. ఇందుకోసం పలు సూచనలు కూడా చేశాయి హిందూ సంఘాలు. ఇందులో తక్షణ భద్రతా చర్యలతో పాటు దీర్ఘకాళిక రక్షణ చర్యలను కూడా సూచించాయి. తక్షణ సహాయం కింద తాజా దాడుల్లో నష్టపోయిన హిందువులకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. హిందువులకు చెందిన వ్యాపార సంస్థలపై దాడులు జరగటంతో ఆస్థినష్టం వాటిల్లిందనీ,.. వీటన్నిటినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. తర్వాత ఈ అల్లర్లలో పాల్గొన్న నిందితులను పోలీసులు గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వీటిపై ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తి చేసి ప్రజల్లో నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో పాటు బ్రిటన్‎లో సోషల్ మీడియా వేదికగా హిందూ ఫోబియాను వ్యాప్తి చేసే పోస్టులను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచి తమక పూర్తి రక్షణ కల్పించాలనీ,.. మరీ ముఖ్యంగా దీపావళి లాంటి పెద్ద పండుగలకు పూర్తి రక్షణ కల్పించాలని హిందూ సంఘాలు తమ లేఖలో పేర్కొన్నాయి.

ఇక ఇప్పటికే జరిగిన దాడులవల్ల బ్రిటన్ లో హిందువులు బిక్కు బిక్కుమంటూ బ్రతికే పరిస్థితి వచ్చింది. తమకు పూర్తి భద్రత కరువైందని కొంతమంది హిందువులు తమ ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వదిలి వెళ్ళిపోతున్నారు. వీటన్నిటికీ ముఖ్యంగా బ్రిటన్ లో స్తిరపడ్డ పాకిస్తానీయులే ఈ దాడులకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారంలో బయటపడింది. ఇకనైనా బ్రిటన్ ప్రభుత్వంలో కదలిక వచ్చి హిందువులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరముంది. లేకపోతే భారతీయుల నమ్మకం కోల్పోయి ఎంతో విలువైన నైపుణ్యం గల మానవ వనరులను బ్రిటన్ చేజేతులా వదులుకున్నట్లవుతుందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =