లోన్ యాప్ లు చేస్తున్న దారుణాలు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఫైర్ మ్యాన్ సుధాకర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. లోన్ యాప్స్ వేధింపుల కారణంగా ఫైర్ మెన్ సుధాకర్ ఆత్మహత్య. రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గోల్డెన్ రూపీ యాప్ ద్వారా ఆరువేల రుణం తీసుకున్న సుధాకర్.. దీంతో లోన్ యాప్ ఏంజెంట్లు గత కొంత కాలంగా సుధాకర్ ను వేధిస్తూ ఉన్నారు. యాప్ నిర్వాహకులు సుధాకర్ బంధువులు, స్నేహితులకు అసభ్యకరంగా మెసేజ్లు పంపడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సుధాకర్ తన అన్నకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీ భార్య ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్ సైట్ లో పెడితే రోజుకు వెయ్యి సంపాదించవచ్చు అంటూ హింసించడంతో అవమాన భారంతో అతడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. సుధాకర్ ఒక చీటర్ అని, ఆయన సన్నిహితులకు కూడా మెసేజ్ లు పెట్టేవారు. ఈ చర్యలతో విసిగిపోయిన కానిస్టేబుల్ తన దగ్గరి వారి దగ్గర ఈ గోడు వెల్లబోసుకున్నాడు. అయితే తీవ్ర మానసిక వేధనతో ఉన్న సుధాకర్ మంగళవారం ఉదయం శివరాంపల్లి – శాస్త్రీపురం మార్గంలో ట్రైన్ కింద పడి ఆతహత్య చేసుకున్నాడు.
జల్పల్లికి చెందిన 33 ఏళ్ల యంజాల సుధాకర్ ఫైర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చందులాల్ బారదరి ఫైర్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. అతడికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. భార్య, 18 నెలల కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.