ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్‌లో లిఫ్ట్‌వైర్ తెగిపోవడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ఎనిమిది మంది లిఫ్ట్ లో పైకి వెళుతుండగా వైర్ తెగి లిఫ్ట్ కింద పడింది. దీంతో లిఫ్ట్ లో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.