More

  అఫ్తాబ్‎కు మతిస్థిమితం లేదట..?! ‘సెక్యులర్ మీడియా’ మానసిక రోగం..! ‘సెక్షన్ 84’ రాతలు అందుకేనా..?

  ఢిల్లీలో సంచలనం రేపిన లవ్ జీహాద్ కేసులో వామపక్ష మీడియా కొత్త రాగాన్ని ఎత్తుకుంది. అఫ్తాబ్ మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక ఛానెల్ రాస్తుంటే,.. నిందితుడికి శ్రద్దా వాల్కర్ పై ఎంతో ప్రేమ ఉండేదనీ,.. అందుకే చంపిన చాలా రోజుల తర్వాత కూడా ఆమె ముఖాన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి చూసేవాడనీ కొన్ని పత్రికలు రాస్తూ వచ్చాయి. మరికొన్ని మీడియా సంస్థలైతే నిందితుడి ఇన్‎స్టాగ్రామ్ అకౌంట్‎ను పరిశీలిస్తే,.. అతడికి మహిళలపై ఎంతో గౌరవముందనీ.. ఈ హత్య ఏదో క్షణికావేశంలో జరిగి ఉండొచ్చనీ ప్రచారం చేస్తున్నాయి. అయితే లెఫ్ట్ లిబరల్ మీడియా సంస్థలు ఈ ప్రచారాన్ని ఏదో ఉత్తుత్తిగా ప్రచారం చేయడం లేదు. దీని వెనుక పెద్ద కుట్రే ఉంది. రాజ్యాంగంలోని ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం నిందితుడిని శిక్ష నుంచి తప్పించే కుట్రకు మీడియా సంస్థలు పాల్పడుతున్నాయా..? అనే అనుమానాలొస్తున్నాయి. అయితే ఈ సెక్షన్ ఏం చెబుతుంది..? ఇది ఒక లూప్ హోల్ గా పని చేస్తోందా..? అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు, మన నేషనలిస్ట్ హబ్ ఛానెల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‎పై క్లిక్ చేయండి. అంతేకాదు, మిత్రులారా.. మన గ్రూప్ ఆఫ్ చానెల్స్ అన్నింటినీ సబ్ స్క్రయిబ్ చేసుకుని.. జాతీయవాద మీడియాకు మరింత బలం చేకూర్చండి. ఇక వివరాలు చూద్దాం.

  ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 84లో ‘Act Of A Person Of Unsound Mind’ అనే దాని గురించి వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం.. Nothing Is An Offence Which Is Done By A Person Who, At The Time Of Doing It, By Reason Of Unsoundness Of Mind. అంటే ఏ వ్యక్తి అయినా నేరం చేసేటప్పుడు, లేదా నేరం చేసే సమయంలో మతిస్థిమితం కానీ మానసిక స్థితి కానీ సరిగ్గా లేకపోతే దాన్ని నేరంగా పరిగణించబడదనేది దీనర్థం. అదీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 84. కోర్టులో కూడా, నిందితుడు నేరం చేసే సమయంలో మానసికంగా సరిగ్గా లేడని నిరూపిస్తే,.. అతడికి శిక్షను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్‎ను ఉపయోగించుకునే లెఫ్ట్ లిబరల్ మీడియా అతి క్రూరుడైన అఫ్తాబ్‎పై ప్రేమను కురిపిస్తున్నాయి. హత్య చేసే సమయంలో అతడిలో మానసిక స్థిమితం సరిగ్గా లేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని మీడియా సంస్థలైతే అఫ్తాబ్‎ను సైకోపాత్‎గా నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి ప్రధానమైన ఆధారమైతే ఏదీ లేకపోయినా,.. ఆయా మీడియా సంస్థలు నిపుణులు అభిప్రాయపడుతున్నారంటూ.. తమ స్వంత ఊహాగానాలను జోడిస్తున్నాయి. అతడిని చూస్తే సైకోపాత్‎గా కనిపిస్తున్నాడనీ,.. తన రూంలోనే శ్రద్దా వాల్కర్ మృతదేహమున్నా కూడా 18 రోజులు గడపగలగటాన్ని చూస్తుంటే దీనిపై ఖచ్చితంగా సందేహాలొస్తున్నాయనీ.. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని రాసుకొస్తున్నాయి.

  ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. అఫ్తాబ్‎కు శ్రద్ధాపై ఎనలేని ప్రేమ ఉందన్న ప్రచారాన్ని కూడా.. కొన్ని మీడియా సంస్థలు కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ మీడియా పోర్టల్ ఎన్డీటీవీ ‘Man Who Killed Partner ‘Used To See Her Face’ After Keeping Head In Fridge’ అనే శీర్షికతో ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ వార్తలో పూర్తిగా తొంగి చూస్తే దానికి ఎటువంటి ఆధారమూ లేనట్లు కనిపిస్తోంది. కేవలం ‘Said Sources’ అని చివర్లో జతచేస్తూ ఆ వార్తను రాసుకొచ్చింది ఎన్డీటీవీ. అయితే ఈ ‘సోర్స్’ అనే పదం సరిగ్గా వాడకపోతే.. అది స్వంత ఊహాగానం కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక వార్తా సంస్థలతో పాటు కుహనా లౌకిక వాదులు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రచారాల వల్ల నిందితుడికి పరోక్షంగా మేలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేకపోతే అతడికి శిక్ష తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కోర్టులో వాదించే న్యాయవాదులు ఈ పత్రికల కథనాలనే ఆధారంగా చేసుకుని నిపుణుల సూచనలివి అంటూ ఆధారంగా చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో అఫ్తాబ్ కు పరోక్షంగా సహాయం చేసినట్లవుతుంది.

  అయితే ఈ ప్రచారాలు ఇప్పుడే కొత్తేమీ కాదు. సోకాల్డ్ సెక్యులరిస్టులు కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న కిటుకే ఇది. రియాజ్ నైకో ఒక గణిత ఉపాధ్యాయుడనీ, అతడు లెక్కలు బాగా చేసేవాడనీ,.. ఆదిల్ అహ్మద్ దార్ ను చిన్నప్పుడు ఒక సైనికుడు కొట్టినందుకే ఉగ్రవాదిగా మారాడనీ,.. కోర్టులో విచారణ జరిగే సమయంలో అజ్మల్ కసబ్ బాధతో ఏడ్చాడనీ,.. ఇలా ఒకటేమిటి ఇప్పటివరకు సైన్యం కాల్చి చంపిన ఉగ్రవాదులందరి పైనా ఒక సానుభూతి వచ్చేలా ప్రయత్నించి విజయం సాధించారు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. సాధారణంగా కుహనా లౌకిక వాదులు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఒప్పుకోరు. అసలు ఆ మాటకొస్తే ఇస్లాంలో ఉగ్రవాదమే లేదనే వాదనకు దిగిన సందర్భాలు సైతం అనేకం ఉన్నాయి. హిందూ ధర్మంలో ఏనాడూ లేని ఉగ్రవాదాన్ని ఉన్నట్టుగా చూపడానికి గుట్టలకొద్దీ పుస్తకాలను రచించిన అర్ధమేధావులు.. ఇస్లాంలోని ఉగ్రవాదాన్ని మాత్రం ఒప్పుకునే సాహసం చేయరు. అయితే వీరు ఎంత లేదనుకున్నా,.. ఉన్న ఉగ్రవాదం మాత్రం ఆగదు కదా..! దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్రవాదం పడగ విప్పుతూనే ఉంటుంది. అందుకే నాడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాద ఘటన నుంచి నేటి అఫ్తాబ్ లవ్ జీహాద్ వరకు అందరిలోనూ సానుభూతి వచ్చేలా చేయడమే లౌకికవాదుల పనైపోయింది.

  అందుకే దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా,.. లవ్ జీహాద్ సంఘటనలు జరిగినా,.. వాటిలోని క్రూరత్వాన్ని తగ్గించి నిందితులపై ప్రజల్లో ఆగ్రహం రాకుండా చేసే ప్రయత్నాలను నిస్సిగ్గుగా అమలు చేస్తోంది కుహనా లౌకికవాద మీడియా. గతంలో ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత అజ్మల్ కసబ్‎పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. అతడిని వెంటనే ఉరితీయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఉదారవాదులంతా ఒక్కసారిగా కసబ్‎పై సానుభూతి వచ్చేలా ప్రచారం చేశారు. అజ్మల్ కసబ్ చిన్నవాడనీ,.. అతనికేమీ తెలియదనీ,.. ముంబైలో కాల్పులు జరిపేటప్పుడు ఒక చిన్న పిల్లను చూసి నవ్వాడనీ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో అప్పటివరకున్న ఆగ్రహజ్వాలలన్నీ తగ్గిపోయాయి. ఇక తర్వాత అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్‎ల కోసం జరిపిన క్యాండిల్ ర్యాలీలు అన్నీ జరిగిపోయాయి.

  ఇక ఉగ్రవాదులకే క్యాండిల్ ర్యాలీలు సానుభూతి ట్వీట్లు చేసిన ఉదారవాదులు లవ్ జీహాద్ నిందితులకు వంతపాడరనుకుంటే అది పొరపాటే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశంలో లవ్ జీహాద్ ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లవ్ జీహాద్ ప్రమాదాన్ని గుర్తించాయి. ఇప్పటికే దేశంలో 11 రాష్ట్రాలు లవ్ జీహాద్ నిరోధక చట్టాలను కూడా రూపొందించాయి. ఇంత జరిగినా ఉదారవాదులు.. ఈ లవ్ జీహాద్ ప్రమాదాన్ని గుర్తించకుండా.. నేరాన్ని మతిస్థిమితం లేని వ్యక్తి చేసినట్లు చిత్రీకరిస్తున్నారు. దీనికితోడు, లెఫ్ట్ లిబరల్ కుహనా లౌకికవాద మీడియా సంస్థలు కూడా చేతులు కలిపి ప్రచారం నిర్వహించడంతో అఫ్తాబ్‎పై మెల్లి మెల్లిగా సానుభూతి పెరుగుతోంది. ఈ వార్తలను చదివిన వ్యక్తులు అతడి మానసిక స్థితి సరిగ్గా లేనందుకే అలా చేశాడని భావిస్తున్నారు. దీంతో అతడిని ఉరితీయాలనే డిమాండ్ కూడా తగ్గిపోయే అవకాశముంది. అంతేకాదు ఒకవేళ ఈ ప్రచారమే కానీ ప్రజల్లో బలంగా వెళితే కోర్టుల ముందు కూడా ఇదే వాదన చేసి అతడికి శిక్ష తగ్గించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

  మరి, నిందితుడు అఫ్తాబ్‎కు మహిళలపై అంతటి గౌరవముంటే ఇంతటి దారుణానికి పాల్పడేవాడా అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. శ్రద్దా వాల్కర్‎పై అతడికి అంతటి ప్రేమే ఉంటే ఏడాది పాటు ఆమెను దెబ్బలతో హింసించేవాడా..? అనే ప్రశ్నలకు ఉదారవాదుల వద్ద కూడా సరైన సమాధానం లేదు. దీంతో ఉదారవాదులు చేసే ఇటువంటి దుష్ప్రచారాల వల్ల సమాజానికి ఎంతవరకు లాభం చేకూరుతుందనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో తొలగించాల్సిన మేధావులు.. ఇటువంటి ఉగ్రవాద భావాలున్న వారికి సానుభూతి వచ్చేలా ప్రయత్నించడం ఎంతవరకు సబబు..? దీనివల్ల సమాజంలో నష్టమే తప్ప లాభం లేదనీ నిజాలను గ్రహించి వార్తను వార్తగా అందిస్తే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు కదా..! కాసుల కక్కుర్తి, మైనార్టీ రాజకీయ మత్తులో కుహనా లౌకికవాద మీడియా ఈ చిన్న లాజిక్‎ను మిస్సవుతోంది.

  Trending Stories

  Related Stories