More

  చంపితే చంపండి..! గుడిని వదలను..!!
  తాలిబన్లకు వెన్నుచూపని హిందూ పూజారి..!

  ఎటుచూసినా తాలిబన్ ముష్కరమూకలు. చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు. ఎప్పుడు ఎవరిపై గర్జిస్తాయో తెలియని రాకెట్ లాంఛర్లు. అమెరికా, నాటో దళాలు వెనుదిరిగిన తర్వాత.. ఇదీ ప్రస్తు ఆఫ్ఘన్ ముఖచిత్రం. తాలిబన్లు పొలిమేరల్లోకి వచ్చారని తెలియగానే.. ఆఫ్ఘన్ పౌరులు పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రాణభయంతో హమీద్ కర్జాయ్ విమానాశ్రయంలోకి పరుగెత్తి.. అందిన విమానం ఎక్కేస్తున్నారు. అవి ఏ దేశ విమానాలో.. తమను ఎక్కడికి చేరుస్తాయో కూడా చూడటం లేదు. ప్యాసింజర్ విమానాలా..? కార్గో విమానాలా..? పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడితే అదే పదివేలు అనుకుంటూ.. పారిపోవడానికి సిద్ధమవుతున్నారు. గత్యంతరం లేక చివరికి విమానం రెక్కలపైనా ప్రయాణిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. తాలిబన్ల ఆక్రమణతో చిగురుటాగులా వణికిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ దృశ్యాలే కనిపిస్తున్నాయి.

  తాలిబన్ దురాగతాలకు భయపడి ఆ దేశంలోని ముస్లిమేతరులే కాదు.. స్వమతస్తులైన ముస్లింలు సైతం పలాయనం చిత్తగిస్తున్నారు. సాక్షాత్తు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సైతం దేశం విడిచి పారిపాపోయాడు. ఇలాంటి భయంకర దృశ్యాల మధ్య ఓ హిందూ పూజారి మాత్రం తాలిబన్లకు ఎదురునిలిచాడు. ఓ భగత్ సింగ్‎లా, ఓ సుభాష్ చంద్రబోస్‎లా సవాలు విసిరిరాడు. ప్రాణాలుపోయినా తగ్గేదే లే అంటూ.. ఓ అల్లూరిలా, ఓ టంగుటూరిలా గుండెలు చూపించాడు. అతడే పండిట్ రాజేష్ కుమార్.

  ఆఫ్ఘనిస్తాన్‎లోని హిందూ దేవాలయాలు ఎప్పుడో ధ్వంసమయ్యాయి. చీకట్లో దీపాల్లా ఒకటి.. అరా మిణుకుమిణుకుమంటున్నాయి. అలాంటి ఓ దేవస్థానమే కాబూల్‎లోని రతన్ నాథ్ మందిరం. ఆ ఆలయ పూజారే పండిట్ రాజేష్ కుమార్. చెప్పాలంటే, ఆఫ్ఘనిస్తాన్‎లో మిగిలిన చివరి హిందూ పూజారి ఆయనే. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశమవుతున్నవేళ.. తోటి హిందువులు, స్థానిక ముస్లింలు రాజేష్ కుమార్‎కు పారిపోవాలని సూచించారు. తన ప్రయాణానికి, ఉండటానికి కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే, వారి అభ్యర్థనను తిరస్కరించాడు రాజేష్ కుమార్. వందల ఏళ్ల నుంచి తమ పూర్వీకులు రతన్ నాథ్ మందిర్ దేవాలయానికి సేవ చేస్తున్నారని అన్నాడు. ఒకవేళ తాలిబన్లు తనను చంపినా.. తన ప్రాణాన్ని భగవంతుడి సేవకు అర్పిస్తానని.. కానీ, వారికి భయపడి గుడిని వదిలి పారిపోయేది లేదని ప్రతినబూనాడు. భరద్వాజ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్‎లో పంచుకున్నారు.

  https://twitter.com/BharadwajSpeaks/status/1426977857167781891

  అర్చక కుటుంబాలకు చెందిన ఓ పది పదిహేనుమంది తప్పితే.. ఆప్ఘనిస్తాన్‎లో అసలు హిందువులే మిగిలి లేరు. మిగతా హిందువులందరూ మతోన్మాదుల అరాచకాలకు బలయ్యారు. కొందరు దేశం విడిచి పారిపోయారు.

  https://twitter.com/BharadwajSpeaks/status/1427348873186463772

  1970 దశకంలో ఆఫ్ఘనిస్తాన్ హిందూ జనాభా 2 లక్షలకు పైనే. 2021 రిపోర్టు ప్రకారం.. పారిపోయిన ముస్లిమేతరుల్లో హిందువులు, సిక్కులు కలిపి వెయ్యి మంది కూడా లేరు. బౌద్ధుల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆఫ్ఘనిస్తాన్‎లో వారు శతాబ్దాల క్రితమే అంతర్ధానయ్యారు.

  https://twitter.com/NoyanSubutai/status/1427350072333783057

  అయినా, భగవంతుని సేవలో అంకితమై.. వంశపారంపర్యంగా వస్తున్న పురాతన ఆలయాల రక్షణే ధ్యేయంగా.. కొందరు హిందూ పూజారులు ఇప్పటికీ అక్కడే వున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గుండె నిబ్బరంతో హైందవ ధర్మం కోసం నిలబడ్డారు.

  ఇదిలావుంటే, ఆఫ్ఘనిస్తాన్‎లో వున్న హిందువులు, సిక్కులు స్వదేశానికి రావడానికి భారత్ సాయం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి ప్రకటించారు. ఆఫ్ఘన్ సిక్కు, హిందూ సంఘాలతో తాము టచ్‎లో వున్నామని.. వారు స్వదేశానికి రావాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

  ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత.. హిందు, సిక్కు వర్గానికి చెందిన చాలామంది కాబూల్ కార్టే పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందారని.. ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్‎మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మైనార్టీలకు సంబంధించి DSGMC చీఫ్.. కాబూల్ గురుద్వారా కమిటీ అధ్యక్షుడితో నిత్యం టచ్‎లో వున్నారు.

  ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‎లోని హిందూ, సిక్కు మైనార్టీలు నిరంతరం భయంతో బతుకీడుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ, సైనిక మార్పులు జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులో సురక్షిత జీవితం గడపాలని కొందరు ఆశతో ఉన్నారు. ఇంకొంతమంది తాలిబన్లకు భయపడకుండా ఏదైతే అదవుతుందని గుండె నిబ్బరంతో వున్నారు. అలాంటివారిలో ఒకడే పండిట్ రాజేష్ కుమార్. తాలిబన్ల తూటాలు తనను చిధ్రం చేస్తాయని తెలిసినా.. ధర్మం కోసం నిలబడ్డాడు. హైందవ ధర్మానికి ప్రతీకలాంటి ఆలయాన్ని రక్షించుకునేందుకు తాను అసువులు బాసేందుకు సిద్ధమయ్యాడు. తాలిబన్లకు భయపడకుండా.. తానే ఓ ఆయుధమై నిలిచాడు. ఇది కదా క్షాత్రమంటే..! ఇదే కదా ధర్మమంటే..!!

  Trending Stories

  Related Stories