More

  నిన్న రియాజ్.. నేడు హుస్సేన్..! బీజేపీలోకి చొరబడుతున్న ఉగ్రమూక..!!

  ముష్కరులు భారత్‎లో విధ్వంసం సృష్టించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. మన దేశాన్ని దెబ్బ తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే మన వేలుతో మన కన్నునే పొడువాలని చూస్తున్నారు.

  తీవ్రవాదులు బీజేపీలోకి చాపకింద నీరులా ఎంటర్ అవుతున్నారు. నిన్న ఉదయపూర్ టైలర్ హత్యలో ప్రధాన నిందితుడు రియాజ్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన విషయం మరువకముందే జమ్ములో మరో ఘటన బయటకు వచ్చింది. ఓ ఉగ్రవాదికి బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు తెలియడంతో కమలం పార్టీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

  జమ్ముకశ్మీర్‌లో రియాసీ జిల్లాలో పట్టుబడిన ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదుల్లో ఒకరు బీజేపీ క్రియాశీల సభ్యుడు ఉండటం సంచలనం రేపుతున్నది. ఆశ్రయం పేరుతో తుక్సన్‌లో గ్రామంలోకి వచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను గ్రామస్తులు ఎంతో ధైర్యసాహసాలతో పట్టుకొని నిర్బంధించారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాదులను మోస్టు వాంటెడ్‌ తాలిబ్‌ హుస్సేన్‌ షా, ఫైజల్‌ అహ్మద్‌ దార్‌గా పోలీసులు గుర్తించారు. వీరిలో హుస్సేన్‌ షా బీజేపీ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే రైఫిళ్లు, ఏడు గ్రెనేడ్లు, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన గ్రామస్తులకు డీజీపీ రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను పట్టుకోవడంలో గొప్ప ధైర్యం, సాహసాలను ప్రదర్శించినందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా టక్సన్ ధోక్ గ్రామస్తులకు రూ. 5 లక్షల నగదు రివార్డులను కూడా ప్రకటించారు.

  రాజౌరీ జిల్లాకు చెందిన హుస్సేన్‌ షా జమ్ము రీజియన్‌ బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్‌ మీడియా ఇన్‌చార్జి. జమ్ములో హుస్సేన్‌ షాను పార్టీ మైనార్టీ మోర్చా కొత్త ఐటీ అండ్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా నియమిస్తూ బీజేపీ మే 9న ఆర్డర్‌ కూడా విడుదల చేసింది. అదేవిధంగా హుస్సేన్‌ షాకు పలువురు బీజేపీ సీనియర్‌ నేతలతో కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. జమ్ముకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనాతో పాటు తదితరులతో దిగిన ఫొటోలు చాలా ఉండటం ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ పరిశీలన లేకుండా పార్టీలో చేర్చుకునే ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు వ్యవస్థ వల్ల ఈ తప్పిదం జరిగిందని, ఇదొక కుట్ర కోణం అని బీజేపీ ప్రకటించింది. అరెస్టయిన టెర్రరిస్టులలో ఒకరైన తాలిబ్ హుస్సేన్, బీజేపీలోకి చొరబడ్డాడని ఆ పార్టీ స్పష్టం చేసింది. అయితే, తాలిబ్ హుస్సేన్ కేవలం 18 రోజులు మాత్రమే పార్టీ సభ్యుడిగా కొనసాగారని, మే 27, 2022న రాజీనామా చేశారని కమలనాథులు వెల్లడించారు.

  మరోవైపు ఉదయపూర్ టైలర్ హత్యలో ప్రధాన నిందితుడు అయిన రియాజ్ కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. రియాజ్ బీజేపీ కార్యక్రమాలకు పబ్లిక్ గా హజరవుతూ.. ప్రైవేటుగా అదే పార్టీని విమర్శించే వాడని పోలీసులు ఎంక్వైరీలో బయటపడింది. తన సన్నిహితులతో కమలదళాన్ని అనేక సార్లు విమర్శించినట్లు విచారణలో తేలింది. అయితే ఇక్కడ నిందితుల మాస్టర్ మైండ్ స్పష్టం అర్ధం అవుతోంది. కన్హయ్య లాల్ హంతకుడు రియాజ్ బీజేపీలో చేరి నేరాలకు పాల్పడి, చివరకు హిందువులపైకి నెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జిహాదీలకు ఇలాంటి నేరపూరిత పూర్వాపరాలు గతంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వారి ఇస్లామిక్ తీవ్రవాద ప్లాన్‎లో భాగంగా వారు పార్టీలో చేరాలని, జిహాదీ కార్యకలాపాలకు పాల్పడి.. దానిని బిజెపి, హిందువులపై రుద్దాలనుకుంటే మాత్రమే బిజెపిలోకి చొరబడటానికి ప్రయత్నిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇలా బీజేపీలోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే విషయం తెలియడంతో అధినాయకత్వం అలర్ట్ అయ్యింది. పార్టీలోకి మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలపై నిఘా పెట్టే పనిలో పడింది.

  spot_img

  Trending Stories

  Related Stories