More

    మున్సిపాలిటీ డంపింగ్ యార్డు వద్ద చిరుత పులి మృతి..!

    నల్లగొండ మండలం చందన పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న నల్లగొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డు దగ్గర చిరుత పులి మృతదేహాన్నీ స్థానికులు గుర్తించారు. డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్ల పొదల్లో చనిపోయి కనిపించింది. ఇది చనిపోయి కొన్ని రోజులు అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లాలోని కేశరాజుపల్లి, శేషమ్మ గూడెం, ఎస్టీ కాలనీ, చందనపల్లి గ్రామాల్లో చిరుత పులి సంచారంపై పలువురు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ చిరుత చనిపోయి కనిపించింది.

    డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తిని వారం పది రోజుల క్రితం చిరుత చనిపోయినట్లు తెలుస్తున్నది. బుధవారం ఉదయం డంపింగ్ యార్డ్ వద్ద చిరుతపులి కళేబరాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ, పోలీస్‌ శాఖ అధికారులు చిరుతను పరిశీలించారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపనున్నారు.

    Trending Stories

    Related Stories