దిగ్గజ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు ఇంట విషాదం నెలకొంది. సింగీతం శ్రీనివాసరావు సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. అనారోగ్య కారణంతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది’ అని సింగీతం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. 1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది. సినిమా స్క్రిప్ట్ రాయడంలో ఆయనకు సహాయం చేసేవారు. లక్ష్మీ కల్యాణి గురించి ఆయన ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ప్రస్తుతం సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.