More

    కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ

    కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై ఆమె దీటుగా స్పందించారు. ఆమె న్యాయపరమైన చర్యలకు దిగారు. తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, నెట్టా డిసౌజాలకు ఉద్దేశించి ఆమె నోటీసులు పంపారు. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు ఈ అసత్య ఆరోపణలు చేశారని, ఆమె, ఆమె కుమార్తె నడవడికపై నష్టదాయక ప్రచారం సాగించారని స్మృతి ఇరానీ న్యాయవాది ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

    కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమ బార్‌ను నడుపుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. వెంటనే ప్రధాని మోదీ స్పందించి స్మృతి ఇరానీని బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ శనివారం డిమాండ్‌ చేశారు. ఇరానీ కుమార్తె జోయిష్ గోవాలో ‘నకిలీ లైసెన్స్’తో బార్, రెస్టారెంట్ నడుపుతోందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మీడియాతో అన్నారు. 13 నెలల క్రితం మరణించిన వ్యక్తి పేరిట స్మృతి ఇరానీ కుమార్తె లైసెన్స్ పొందిందని ఖేరా అవినీతి ఆరోపణలు చేశారు. విలేకరుల సమావేశంలో ఇరానీ ఆరోపణలను తిప్పికొట్టారు. తన కూతురు చట్ట విరుద్ధంగా బార్ నడుపుతోందన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. 18 ఏళ్ల వయసున్న ఒక ఆడపిల్లపై, ఒక కళాశాల విద్యార్థినిపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఆమెపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఇరానీ ఆవేదన వ్యక్తం చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories