More

  టార్గెట్ మోదీ.. బయటపడ్డ మీడియా కుట్ర..!

  దేశభక్తి లేనివాడు శత్రువుతో సమానం. దేశభక్తి లేని మీడియా శత్రువు కంటే ప్రమాదం. మన దేశంలో కుహనా లౌకికవాద లెఫ్ట్ లిబరల్ మీడియా ఈ కోవకే చెందుతుంది. విదేశాల ఎజెండాను తమ భుజస్కందాలపై మోస్తూ.. దేశాభివృద్ధిని, దేశ భద్రతను కాలరాస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎర్ర పాత్రికేయం ఇలా వెర్రివెతలు వేస్తూనేవుంది. వీళ్లకు నీతి, నియమం పట్టదు. ధర్మం, సంప్రదాయం రుచించవు. కనీసం.. జర్నలిజానికి మూలసూత్రమైన ‘నిజం’ అనే మాట కూడా వీళ్లకు నచ్చదు. విదేశీ శక్తులు విసిరే ఎంగిలిమెతుకుల కోసం ఎంతటికైనా దిగజారుతారు. ఎన్ని కుట్రలైనా చేస్తారు..! ఎన్ని కుతంత్రాలైనా పన్నుతారు..!!

  భారత దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో విదేశీ శక్తులు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటాయి. అది వాళ్ల స్వార్థం. కానీ, ఈ దేశంలో ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం తిండిని విదేశీ తొత్తులుగా పనిచేస్తున్న.. కుహనా లౌకికవాద లెఫ్ట్ లిబరల్ మీడియా సంస్థలే ఈ దేశానికి పట్టిన దరిద్రం. నిజానికి, విదేశీ శక్తులకన్నా.. వారి అడుగులకు మడుగులొత్తే ఇలాంటి వాళ్లతో పెను ప్రమాదం. 2014లో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎర్ర మీడియా పైత్యం అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘పెయిడ్’ ఉద్యమాలను ప్రోత్సహించడం,.. విదేశీ టూల్ కిట్లను వెనకేసుకురావడం,.. శ్మశాన జర్నలిజం దగ్గర్నుంచి.. తాజాగా వెలుగుచూసిన ‘పెగాసస్’ వ్యవహారం వరకు.. అన్ని కుట్ర పూరిత కోణాలే. సరిగ్గా పార్లమెంటు సమావేశాలకు ఒక్కరోజు ముందు ఏవో సీక్రెట్ ఫైల్స్ లీక్ చేసినట్టు.. ప్రముఖుల ఫోన్లు హ్యాకవుతున్నాయంటూ.. ఓ కొత్త నాటకాన్ని రక్తికట్టించింది. పాశ్చాత్య మీడియా పంచిన కాపీలను మక్కీ టు మక్కీ అచ్చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు చూపకుండా పసలేని కథనాలను వండి వార్చింది. అయితే, లెఫ్ట్ మీడియాకు ఇదేం కొత్త కాదు. అబద్ధాల్ని నిజాలుగా నమ్మిస్తూ.. ఒకే పక్కకు ఒదిగిపోవడం దానికి ‘పెన్ను’తో పెట్టిన విద్య.

  భారత్‎లో మెజారిటీ మీడియా సంస్థలు, మీడియా ప్రముఖులు.. విదేశాల చేతుల్లో కీలుబొమ్మలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయ జర్నలిజం డిక్షనరీలో తటస్థ వైఖరి అనే పదం ఎప్పుడోమాయమైపోయింది. ఇప్పుడు అది ఒక అపోహ మాత్రమే. ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు. ఒకటి పార్లమెంట్, రెండు కార్యనిర్వాహక వ్యవస్థ, మూడవది న్యాయవ్యవస్థ. ఇక, నాలుగవది మీడియా. వీటిలో ఏ ఒక్క పిల్లర్ సరిగా పనిచేయకపోయినా.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అదే, వీటిలో దేనినైనా విదేశీ శక్తులు నియంత్రిస్తే ఇంకెంత ప్రమాదమో ఊహించండి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి అదే జరుగుతోంది. ఫోర్త్ ఎస్టేట్స్ లోని ఫోర్త్ ఎస్టేట్ ఇప్పుడు విదేశీ శక్తుల నియంత్రణలోకి వెళ్లిపోయింది. అంతా అని కాదు గానీ, దాదాపు 80 శాతం భారతీయ మీడియా విదేశీ ఎన్జీవో చెల్లింపుల మేరకు నడక సాగిస్తోంది. సోకాల్డ్ జర్నలిస్ట్ మేధావుల్లో చాలామంది.. తమ విలాసాలు, భోగలాలసాలు తీర్చే అదృశ్య శక్తుల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. విదేశీ శక్తుల ఎజెండాను అమలు చేసే యంత్రాలుగా మారిపోయారు. మీడియా సంస్థల్లో ఎక్కువ శాతం జార్జ్ సొరోస్ విదేశీ స్వార్థపూరిత శక్తుల కోసమే పనిచేస్తున్నాయి. అలాంటి మీడియా సంస్థల నుంచి పుడుతున్నవే ఈ టూల్ కిట్లు, పెగాసస్‎ వివాదాలు.

  ఎన్జీవోల పేరుతో ఓ సాలెగూడు నిర్మించిన జార్జ్ సొరోస్.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నాడు. భారత దేశానికి వ్యతిరేకంగా.. ముఖ్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. స్వార్థపూరిత మేధోవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అన్ని రకాల ఆర్థిక అండదండలు అందిస్తున్నాడు. ఇదే లక్ష్యంతో 1995లో ఆయన ఊపిరిపోసిన ‘మీడియా డెవలప్‎మెంట్ ఇన్వెస్ట్‎మెంట్ ఫండ్’‎ అనే విత్తనం.. నేడు మహా విషవృక్షంలా మారింది.

  మీడియా ప్రభావం ఎక్కువగా వున్న దేశాల్లోని.. స్వతంత్ర మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టి.. అక్కడి ప్రభుత్వాలను అస్థిరపరచడమే.. మీడియా డెవలప్ మెంట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ప్రధాన లక్ష్యం. మనదేశంలో లెఫ్ట్ మీడియా స్క్రోల్ తో పాటు.. గ్రామ్‎వాని వంటి వెబ్ సైట్లు MDIF లబ్ధిదారులే. ఇక, సొరోస్ మానసపుత్రిక, ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్’.. ‘ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ఇన్విస్టిగేటివ్ జర్నలిజం’లో పెద్దయెత్తున పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థకు భారత్ పాటు.. ప్రపంచవ్యాప్తంగా వున్న జర్నలిస్టులతో అనుబంధం కలిగివుంది. మన దేశం నుంచి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన రితు సరిన్, శ్యామ్ లాల్ యాదవ్, పి. వైద్యనాథన్ అయ్యర్ తో పాటు.. మాజీ IANS ఎడిటర్ రాకేష్ కల్షియాన్, ఏషియన్ ఏజ్ సంస్థకు చెందిన మురళీకృష్ణన్, యూసుఫ్ జమీల్, డేటాలీడ్స్ నుంచి సయ్యద్ నజకత్ లు ICIJ లో సభ్యులుగా వున్నారు.

  ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు.. నిరంతరం ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాసే.. లెఫ్ట్ మేధావుల మంచి చెడులు కూడా చూస్తోంది. ఆర్థిక వనరులు కల్పిస్తోంది. OSF లిస్టులో హర్ష్ మందర్, ప్రతాప్ భాను మెహతా, ఇందిరా జైసింగ్, అమర్త్యసేన్ వంటి ప్రముఖ పేర్లు కనిపిస్తాయి. అంతేకాదు, కశ్మీర్‎లో పాకిస్తాన్ అనుకూల కథనాలు రాసే జర్నలిస్ట్ బషరత్ పీర్.. 2009 నుంచి 10 వరకు ఓపెన్ సొసైటీ ఫెల్లోగా పనిచేశాడు. దీనిని మేధోవర్గాలు చాలా ప్రభావితమైన పదవిగా పరిగణిస్తాయి. ఇలా విదేశీ సంస్థల నుంచి మీడియా సంస్థలకు, లెఫ్ట్ మేధోవర్గానికి నిధులు అందుతూనేవుంటాయి.

  అటు సొరోస్‎తో పాటు.. చైనా సైతం ప్రపంచ మీడియాను ప్రభావితం చేస్తోంది. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వార్తాసంస్థలో కూడా చైనా పెట్టుబడులు వున్నాయంటే.. మీడియా సంస్థలపై డ్రాగన్ ఎలా పట్టు పెంచుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి, చైనా కమ్యూనిస్టు పార్టీ.. మన లెఫ్ట్ మేధావులకు సాయం చేయకుండా వుంటుందా..! భారత్‎లో లెఫ్ట్ మీడియాను చైనా పెంచి పోషిస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ అభిసార్ శర్మ పనిచేసే.. ఆన్ లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ కు కూడా చైనా నుంచి డబ్బులు అందుతున్నట్టు తాజా ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇటీవల న్యూస్ క్లిక్ పై జరిగిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్నో రహస్యాలు వెలుగుచూశాయి. న్యూస్‎క్లిక్ ప్రమోటర్లకు చైనా నుంచి దాదాపు 38 కోట్లు వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెప్పడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ డబ్బు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందినదిగా భావిస్తున్నారు. నకిలీ వార్తలను వడ్డించడంలో ముందుండే న్యూస్‎క్లిక్ సంస్థ కార్యాలయంపై.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. సంస్థకు చెందిన అధికారులు, జర్నలిస్టుల ఇళ్లలో కూడా సోదాలు చేసింది. ఈ సందర్భంగా.. న్యూస్‎క్లిక్‎తో చైనా లింకులు వెలుగుచూసినట్టు ఈడీ తెలిపింది. విదేశీ నిధులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో.. న్యూస్‎క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థకు సంబంధం ఉన్నట్టు తేలింది.

  గతంలో ఓసారి న్యూస్‎క్లిక్ సంస్థకు అందుతున్న విదేశీ నిధులు, ఆ సంస్థతో గౌతమ్ నవ్‎లాఖా అనే వ్యక్తికి ఉన్న సంబంధంపై జాతీయ మీడియాలు పలు కథనాలు వెలువరించాయి. స్టార్టకస్ సాఫ్ట్‎వేర్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రబీర్ పుర్కాయస్థ, గౌతమ్ నవ్‎లాఖా డైరెక్టర్లు. నవ్‎లాఖాతో కలిసి కంపెనీని ప్రారంభించడానికి.. విదేశీ నిధులు అందుకున్నట్టు ఈడీ గుర్తించింది. అంతేకాదు, గౌతమ్ నవ్‎లాఖా సైతం న్యూస్‎క్లిక్‎లో స్వతంత్ర భాగస్వామిగా వున్నాడు.

  భారతీయ మీడియా సంస్థల వెనుక ఇంకా ఎన్నో అదృశ్య శక్తులున్నాయి. వామపక్ష ప్రచార కేంద్రమైన ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు, సిద్ధార్థ్ వరదరాజన్ అమెరికన్ సిటిజన్. అంతేకాకుండా, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ లో భాగమైన సౌత్ ఆసియా మీడియా డిఫెండర్స్ నెట్‌వర్క్ లో వరదరాజన్ కోర్ గ్రూప్ సభ్యుడు కూడా. ఈ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ కు అమెరికా పెద్దయెత్తున నిధులు సమకూర్చుతుంది. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల ఖైదీల సహాయార్ధం.. 2019 సెప్టెంబర్ 20న ఒక్కరోజే.. అమెరికా 2 లక్షల 29 వేల 500 నిధులు విడుదల చేసింది. అంతేకాదు, ఓక్ ఫౌండేషన్ నుంచి కూడా CHRI కి పెద్దయెత్తున నిధులు సమకూరుతాయి. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలా వెల్లువలా వచ్చిపడుతున్న నిధులతో ఇక్కడ లెఫ్ట్ మీడియా ఆడిందే, ఆట పాడిందే పాటగా సాగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతూవుంటుంది.

  నకిలీ వార్తలు సృష్టించడమే కాకుండా.. పుకార్లను వ్యాప్తి చేసినందుకు.. వామపక్ష ప్రచార కేంద్రమైన ది వైర్ కు ఇటీవల కశ్మీర్ పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంతేకాదు, వాస్తవాలను తప్పుగా చూపించడం, సెన్సేషన్ క్రియేట్ చేయడం, కొంతమంది నిపుణుల అభిప్రాయంతో వాస్తవాలను తప్పుదోవ పట్టించినట్టు పోలీసులు ఆరోపించారు. అంతేకాదు, ది వైర్ గతంలో ఓసారి కశ్మీర్‎ను ‘భారతీయ ఆక్రమిత కశ్మీర్’గా చూపించి పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శించింది. దీంతో నకిలీ వార్తల్ని, మత విద్వేషాలను వ్యాప్తిచేసినందుకు ది వైర్ జర్నలిస్టులపై కేసు కూడా నమోదైంది.

  భారత ప్రభుత్వ నిర్ణయాలు, కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న లెఫ్ట్ మీడియా.. పాశ్చాత్య దేశాల చేతుల్లో కీలు బొమ్మగా మారిందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి..? లెఫ్ట్ లిబరల్ మీడియా అందిస్తున్న లీకులతోనే.. అమెరికా వంటి అగ్రదేశాలు భారత్‎పై పెత్తనం చెలాయిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్‎కు కావాల్సిన ముడి సరుకులను నిలిపివేసి.. పరోక్షంగా భారతీయ వ్యాక్సిన్ తయారీకి ఆటంకాలు సృష్టించింది. 2024లో మోదీ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలను ప్రభావితం చేస్తుంది.

  దేశంలో కొవిడ్-19 రెండో దశ తీవ్రంగా వ్యాప్తిచెందినా.. భారత ప్రభుత్వం సమర్థవంతంగానే అడ్డుకుంది. వైద్యరంగంలో సూపర్ పవర్లుగా చెప్పుకునే అమెరికా వంటి అగ్రదేశాలకంటే కూడా మెరుగ్గా కట్టడి చేయగలింది. జనాభా విషయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైనప్పటికీ.. విపత్తును దీటుగా ఎదుర్కొంది. ఇందుకు కొవిడ్ గణాంకాలే ప్రత్యక్ష ఉదాహరణ. అయినా, సొరోస్ ప్రేరేపిత కుహనా లౌకిక లెఫ్ట్ లిబరల్ మీడియా విషం కక్కింది. నరేంద్ర మోదీని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించేందుకు శ్మశాన జర్నలిజాన్ని ప్రదర్శించింది.

  ఇక, సొరోస్ అడుగులకు మడుగులొత్తే సోషల్ మీడియా సరేసరి. కొంతకాలంగా ట్విట్టర్ భారత్ పై విషం కక్కుతోంది. భారతీయ చట్టాలను బహిరంగంగా ధిక్కరిస్తూ, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాపుకాస్తోంది. వామపక్షాలకు అనుకూలంగా లేని రాజకీయ అభిప్రాయాలను సెన్సార్ చేస్తూ.. కేంద్ర మంత్రుల ఖాతాలను కూడా లాక్ చేస్తున్న ఉన్మాదాన్ని చూస్తూనేవున్నాం. వీటి లక్ష్యం ఒక్కటే, నరేంద్ర మోదీని ప్రధాని పదవికి దూరం చేయాలి. ఇదే వారి అంతిమ లక్ష్యం. ఇందులో భాగంగానే.. భారతీయ మీడియా, ముఖ్యంగా డిజిటల్ మీడియా పాశ్చాత్య మీడియాతో జతకట్టింది. ఆ పాశ్చాత్య మీడియా ఇప్పుడు అమెరికా రాజకీయ నాయకులు జేబుల్లో వుందన్నది వాస్తవం. ట్రంప్ ను గద్దె దింపడానికి అదే పాశ్చాత్య మీడియా రష్యాను తెలివిగా వాడుకుంది. ట్రంప్ వెనుక రష్యా వుందనే గాలివార్తల్ని సృష్టించి ట్రంప్ ను సాగనంపింది. ఎందుకంటే, ఆయన వుంటే.. సోకాల్డ్ వెస్ట్రన్ మీడియా పప్పులు ఉడకవు. అందుకే, ప్రణాళికాబద్ధంగా స్కెచ్ వేసి మరీ బైడెన్ అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది.

  అమెరికా అధికార యంత్రాంగం.. విదేశాలపై మీడియాను పదునైన అస్త్రంగా ప్రయోగిస్తోంది. తమ పెంపుడు సంస్థలతో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచిపోషిస్తోంది. తద్వారా భారత్ వంటి దేశాలు ఒత్తిడికి లోనై తమతో రాజీ పడతాయన్నది అమెరికా మోసపూరిత వ్యూహం. ఇప్పుడు 2024కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వంపై పాశ్చాత్య మీడియా పైత్యం మరింత పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే, ప్రధాని మోదీ, కేవలం దేశంలోని విదేశీ పెంపుడు మీడియాపైనే కాదు.. పాశ్చాత్య దేశాల మీడియా విషయంలోనూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది. అది ‘ది వైర్’ కావొచ్చు, ‘స్క్రోల్’ కావొచ్చు. ‘న్యూయార్క్ టైమ్స్’ కావొచ్చు, ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘బీబీసీ’ కూడా కావొచ్చు.

  Trending Stories

  Related Stories