ఇంకేం మిగల్లేదు. గాంధార దేశం మరోసారి తాలిబన్ల వశమైపోయింది. అక్కడ ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని ఆశపడిన ఆఫ్ఘన్ల ఆశలు ఆవిరయ్యాయి. అప్పుడే అక్కడ తాలిబన్ల పాలన కూడా మొదలైంది. ఓవైపు దాడులు ఉండబోవని.. కలిసి పనిచేద్దామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా.. తాలిబన్ జన్మత: పుట్టిన బుద్ధి ప్రదర్శన.. అక్కడక్కడా జరుగుతూనేవుంది. తన విషపు కోరల పదును చూపిస్తూనేవుంది. పైకి మహిళల హక్కుల్ని రక్షిస్తామంటూ చెబుతూనే.. ఆఫ్ఘన్లో ఇకపై ప్రజాస్వామ్యం ఉండబోదని.. షరియా మాత్రమే చెల్లుతుందని బాహాటంగా తాలిబన్లు ప్రకటిస్తున్నారు. మహిళలకు అధికారమా..? అంటూ మీడియా ముందే వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. తాలిబన్లకు బయపడి ఇప్పటికేమహిళలు ఇళ్లు దాటడమే మర్చిపోయారు. రెండు దశాబ్దాల క్రితం ఈ కాలకేయ రాక్షసుల కర్కషత్వాన్ని ఎరిగిన ఆఫ్ఘన్ ప్రజలు.. భయంతో బిక్కచచ్చిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఆ అవకాశం కూడా లేని తల్లులు.. కనీసం తమ తరువాతి తరమైనా బతకాలని.. పిల్లల్ని సరిహద్దుల్లోని ఇనుప కంచెలపై నుంచి విసిరేస్తున్నారు. తమ దేశీయులను తీసుకెళ్లడానికి వచ్చిన విదేశీయులను.. తమ పిల్లల్ని తీసుకెళ్లాలంటూ వేడుకుంటున్నారు.
ఇక, తాలిబన్లకు వ్యతిరేకంగా ఎవరైనా ధైర్యం చేసి బయటికొచ్చినా.. ప్రకార్డులు ప్రదర్శించినా.. క్షాణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని అరచకాన్ని చవిచూస్తోంది ఆఫ్ఘనిస్తాన్. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కుహానా లౌకిక మేధావులు, విదేశీ పెంపుడు జాతులు భారత్‌పై విషం కక్కుతున్నాయి. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో అరాచకం రాజ్యమేలుతున్నా.. సోకాల్డ్ ప్రపంచ మేథావులు, లెఫ్ట్ ఇల్లిబరల్ ఇంటలెక్ట్స్, సోకాల్డ్ పర్యావరణ, ప్రజాస్వామ్య, హక్కుల పరిరక్షకులు మాత్రం నోరు మెదపడం లేదు. ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంపై గొంతు చించుకునే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా.. గ్రేటా థన్‌బర్గ్ టూల్ కిట్ మేధావులు, మలాలా వంటి యువ మేథావుల నోళ్లు పెకలడం లేదు. భారతీయ చట్టాల్లోనూ వేలుపెట్టి రాద్ధాంతం చేసే ఈ కుహనా లౌకిక జాతి పక్షలు.. ఆఫ్ఘన్ విషయంలో మానవహక్కులు హరించిపోతున్నా.. మాన ప్రాణాలు మంటగలిసిపోతున్నా. పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలపై ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
అటు, భారత్‌లోని తుక్డే తుక్డే గ్యాంగ్, బాలీవుడ్, కొవ్వొత్తుల బ్యాచులు కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో నోరు మెదపడం లేదు. తాలిబన్ల అరాచకాలను కనీసం ఖండించడానికి కూడా వీళ్లకు మనసు రావడం లేదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, షరియా చట్టాలను వ్యతిరేకిస్తే.. ఎక్కడ ఇస్లాం వ్యతిరేక ముద్ర పడుతుందోనని హడలిపోతున్నారు. తాలిబన్ల అరాచకాలను ప్రత్యక్షంగా విమర్శించే ధైర్యం లేక.. ఇప్పుడు కూడా హిందుత్వంపై పడి ఏడుస్తున్నారు. CAA వ్యతిరేక బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీ టూల్ కిట్ స్వర భాస్కర్.. తాలిబన్లను విమర్శించలేక.. విమర్శించలేక.. నాలుగు మాటలు మాట్లాడింది. అది కూడా తాలిబన్ల అరాచకాలను.. హిందుత్వ తీవ్రవాదం అంటూ తన పైత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం తాలిబన్ టెర్రరిజంతో ఇబ్బందులు పడుతున్నట్టే.. మన దేశంలో హిందుత్వ తీవ్రవాదంతో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే రీతిలో ట్వీట్ చేసింది స్వర భాస్కర్. మానవతా, నైతిక విలువలు.. అణచివేత యొక్క గుర్తింపుపై ఆధారపడి ఉండకూడదంటూ తనదైన శైలిలో విషం కక్కింది. అవునవును.. భారత్‌లో హిందువులు తీవ్రవాదులే..! అందుకేనేమో, తాలిబన్లకు భయపడి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు భారత్‌లో ఆశ్రయం కోరుతున్నారు పాపం..! నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదు.. కొంచెం ఇంగిత జ్ఞానం కూడా వుండాలి. అయినా, నరనరానా జాతి వ్యతిరేకత నింపుకున్న నీకు అదెక్కడుంటుంది..?
ఇక, మీనా కందసామి అనే మరో స్వయంప్రకటిత మేధావి సైతం.. స్వర భాస్కర్‌నే ఫాలో అయింది. హిందుత్వంపై విషం కక్కడమే లక్ష్యంగా ఎన్నో పుస్తకాలు రాసిన ఈ మహా రచయిత్రి.. తాలిబన్లను ఏకంగా ఆరెస్సెస్‌తో పోల్చి తన అక్కసునంతా వెల్లగక్కింది. అయినా, ది గార్డియన్, న్యూయార్క్ టైమ్స్ ఉదారవాద పత్రికల్లో దేశం గురించి విషపు రాతలు రాసే ఈవిడగారికి.. ఆరెస్సెస్ గురించి అంతకంటే ఏం తెలుస్తుంది మరి..!
ఇక, ది వైర్ జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్ షేర్వానీ సరేసరి..! ఈవిడగారు తాలిబన్లను తిరుగుబాటుదారులతో పోల్చేసింది. ఆఫ్ఘన్ పాలకులపై పోరాటంలో భాగంగానే వారు ఉగ్రవాదాన్ని ఎంచుకున్నారని సెలవిచ్చింది. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నంతమాత్రాన, మహిళలను అణచివేస్తున్నంత మాత్రాన.. ఆఫ్ఘనిస్తాన్పై వారికి హక్కులేదనడం అవివేకమంటూ.. తాలిబన్ల పట్ల పరోక్షంగా సానుభూతిని వ్యక్తం చేసింది. మహిళల హక్కుల్ని కాలరాస్తున్న ముష్కర మూకల పట్ల సానుభూతిని ప్రకటించడం.. సాటి మహిళగా ఆమెకే చెల్లింది. అటు, ఆరెస్సెస్ పైనా విషం కక్కింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకుంటే.. కొందరు భారతీయ ముస్లింలను ట్రోల్ చేస్తున్నారంటూ ట్వీట్ చేసింది. ప్రపంచమే నిర్వరపోయేలా ఆప్ఘనిస్తాన్‌లో అంతలా అరాచకాలు జరుగుతున్న ఈ సమయంలోనూ ఆరెస్సెస్ పైనున్న తన ఫోకస్ మాత్రం చెక్కుచెదరలేదు. అందుకే, అర్ఫా ట్వీట్‌కు ఓ నెటిజన్ ఘాటుగానే రిప్లయి ఇచ్చాడు. ప్రపంచంలో ఏం జరిగినా.. అర్ఫా బీవీ దృష్టి మాత్రం.. హిందువులు, ఆరెస్సెస్, బీజేపీ పైనే వుంటుందని చురకలంటించాడు.
మరోవైపు సభా నఖ్వీ అనే వామపక్ష వాది కూడా.. భారత్‌పై విషం కక్కింది. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్లోని భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తక్షణ వీసాల కోసం ప్రత్యేక ప్రత్యేక పోర్టల్ తెరిచింది. ఆగమేఘాల మీద భారతీయులను తరలించింది. అయితే, ఇవన్నీ పట్టని సభా నఖ్వీ.. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయుల కష్టాలపై దొంగ ఏడుపులు ఏడ్చింది. భారత్‌ను క్రిమినల్ అంటూ నోటిదురుసు ప్రదర్శించింది. తాలిబన్లకు భారత ప్రభుత్వానికి తేడా లేదంటూ విషం చిమ్మింది. ఇక లెఫ్ట్ లిబరల్ చాంపియన్ రానా అయూబ్ గురించి చెప్పాల్సిందేముంటుంది. దేశానికి వ్యతిరేకంగా కుట్ర సిద్ధాంతాలను అందంగా వండి వార్చే ఈవిడగారు.. ప్రస్తుత పరిస్థితులకు సంబంధం లేకుండా.. ముస్లిం వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే రీతిలో తన సహజశైలిలో ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. అంతేకాదు, భారత్ హిందూ దేశమని.. ఇక్కడ మైనార్టీలకు చోటు లేదంటూ ఓ ట్వీట్‌ను కూడా జతచేసి తన బుద్ధిని ప్రదర్శించింది. ఇలా ఒకరిద్దరు కాదు.. వందల సంఖ్యలో కుహనా లౌకికవాదులు.. ఎప్పటిలాగే భారత్‌ను విమర్శిస్తూ.. తాలిబన్ల అరాచకాలను మీడియా దృష్టి నుంచి మరల్చడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు.