ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

0
647

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. దారికి ఇరువైపులా నిలబడిన అభిమానులు సూపర్ స్టార్ కృష్ణకు కన్నీటితో వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలోకి కృష్ణ కుటుంబ సభ్యులు, కొద్ది మంది ప్రముఖులను మాత్రమే అనుమతించారు. అంతకుముందు పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్ధివ దేహం ఉంచగా.. సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకు కడసారి నివాళి అర్పించారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన శోభయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు పొటెత్తారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు జనాలు పోటేత్తారు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికార లాంఛనలతో సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు సాగిన ర్యాలీకి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.