13 గంటలకు పైగా సాగిన ఎన్ కౌంటర్… నదీమ్ అబ్రార్ భట్ హతం

జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్ సాగింది. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 13 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో భారత భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. ఒకరు పాకిస్తాన్ ఉగ్రవాది అని తెలుస్తోంది. లష్కర్-ఎ-తైబా టాప్ టెర్రర్ కమాండర్ నదీమ్ అబ్రార్ భట్. ఎన్కౌంటర్ స్థలం నుంచి రెండు ఎకె -47 రైఫిళ్లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా నదీమ్ అబ్రార్ అనేక హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ నదీమ్ అబ్రార్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పరింపోరా చెక్‌పోస్ట్ వద్ద జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వాహన తనిఖీ చేపట్టారు. ఈ సమయంలోనే ఓ కారును ఆపి చెక్ చేస్తుండగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హ్యాండ్ గ్రానైడ్ విసిరేందుకు యత్నించాడు. వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అతడిని పట్టుకొన్నాయి. తీరా అతడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ అని తెలిసింది. సీఆర్ఫీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకోని విచారించారు. ఆయుధాలు దాచిన ఇంటి గురించి తెలిపాడు. నదీమ్ అబ్రార్‌ను తీసుకొని ఆయుధాలు దాచిన ప్రదేశానికి వెళ్లారు సీఆర్పీఎఫ్ సిబ్బంది. అక్కడే దాక్కుని ఉన్న మరో ఉగ్రవాది భద్రతాదళాలపై కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరిపి ఇద్దరినీ అంతమొందించాయి. ఘటనాస్థలంలో అధికారులు ఓ ఏకే 47తోపాటు మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎవరీ నదీమ్ అబ్రార్
2018 డిసెంబర్ నుండి నదీమ్ అబ్రార్ లష్కర్లో చురుకుగా ఉన్నాడు. భద్రతా దళాలు, అమాయక కాశ్మీరీ పౌరులపై అనేక హత్యలకు అబ్రార్ బాధ్యుడు. అంతకుముందు మార్చిలో, శ్రీనగర్‌లోని లావేపోరాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సిబ్బందిని చంపడానికి కూడా అబ్రార్ కీలక సూత్రధారి. అబ్రార్ మధ్య కాశ్మీర్‌లోని బుడ్గామ్లోని నార్బల్ నివాసి.
ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు సిఆర్పిఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించార. పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభించే ముందు కాశ్మీరీ పౌరులను భద్రతా దళాలు రక్షించాయి.