లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతం..!

0
160

లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 7 రోజుల పాటూ సాగిన అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌ కు ఎట్టకేలకు ముగింపు వచ్చిందని ఒక అధికారి తెలిపారు. లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ చనిపోయాడని.. ఆ ప్రాంతంలో మరో ఉగ్రవాది శవం లభ్యమైందని.. అనంత్‌నాగ్‌ ఎన్‌కౌంటర్‌ ముగిసిందని ఏడీజీపీ పోలీస్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

జమ్మూకశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో గత వారం ప్రారంభమైన బీకర ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. ఎన్ కౌంటర్ ముగిసింది కానీ ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. అనంత్ నాగ్ జిల్లాలోని గారోల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్ కు ఈ ప్రాంతం బాగా తెలిసింది కావడంతో ఎన్ కౌంటర్ క్లిష్టంగా మారింది. ఈ ఎన్ కౌంటర్ లో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మరో మేజర్ ఆశిష్ దోంచక్, డీఎస్పీ కేడర్ లో ఉన్న జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారి హుమాయిన్ భట్, ఆర్మీ జవాను ప్రదీప్ ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఏడీజీపీ విజయ్ కుమార్ స్థానికులను కోరారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు చెందిన గ్రెనేడ్ లు, మందుపాతరలు ఉండి ఉండవచ్చని హెచ్చరించారు.

సోమవారం నాడు అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని ఉగ్రవాదులు హతమార్చిన జవాను ప్రదీప్‌గా గుర్తించారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్‌లను గత ఉగ్రవాదులు హతమార్చారు.