భారత్ బోర్డర్ లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు

0
951

దక్షిణ మిజోరంలోని మయన్మార్‌ సరిహద్దులోని సైహా జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు శనివారం తెలిపారు. రహస్య సమాచారం మేరకు అస్సాం రైఫిల్స్ సైనికులు, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో శుక్రవారం సాయంత్రం సైహా జిల్లాలోని మావ్రే గ్రామ సమీపంలోని ఒక పాడుబడిన ప్రదేశం నుండి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను రికవరీ చేశారని రక్షణ, పోలీసు వర్గాలు తెలిపాయి.

స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో 81 కిలోల లిక్విడ్ పేలుడు పదార్థాలు, 94 కిలోల బెలాక్స్ గ్రాన్యులర్ పేలుడు పదార్థాలు, 395 కిలోల జిలాటిన్ స్టిక్స్, 356 రౌండ్ల 12-గేజ్, 70 ఎంఎం కాట్రిడ్జ్‌లు, ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్, లెడ్ యాసిడ్ బ్యాటరీలు, రెండు డిటోనేటర్లు ఉన్నాయి. విదేశీ కరెన్సీ, కమ్యూనికేషన్ పరికరాలు కూడా అధికారులకు దొరికాయి. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను, ఇతర వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు అప్పగించారు. రికవరీకి సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.

పేలుడు పదార్థాలు, ఆయుధాలు వంటి అక్రమ రవాణా మిజోరాం రాష్ట్రానికి, ముఖ్యంగా భారతదేశం-మయన్మార్ సరిహద్దులో ఆందోళన కలిగిస్తున్న విషయం. పెద్ద ఎత్తున పట్టుబడిన ఈ వస్తువులను చూస్తుంటే తీవ్రవాదులు పెద్ద ఎత్తున విధ్వంసానికి రూపకల్పన చేసి ఉన్నారా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని కాపాడడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా చేయబడినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. వీటితో బంగ్లాదేశ్ కు కూడా లింక్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

(21) The Assam Rifles on Twitter: “ASSAM RIFLES RECOVERS HUGE CACHE IN MIZORAM Lunglei Battalion of #AssamRifles alongwith #ManipurPolice recovered 81 kgs liquid, 94 kgs Belox granular explosives, 395 kgs Gelatin rods, 356 rds, 70 mm cartridges & other war like stores near Village Mawhre, Saiha district 31 Dec. https://t.co/phKszld67S” / Twitter