లాలూకు బెయిల్

0
916

రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, లూలూకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో పాటు సగం శిక్షా కాలం జైల్లో గడపడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లూలూకు బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు . రూ. 10 లక్షల జరిమానా, రూ. 1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పారు.

139 కోట్ల డొరండా ట్రెజరీ కుంభకోణం కేసులో ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. డొరాండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలకు పైగా అపహరణకు సంబంధించిన దాణా కుంభకోణం కేసులో 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ ను ఫిబ్రవరిలో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించడంతో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇక శిక్షాకాలంలోనూ చాలా సమయం లాలూ ఆసుపత్రుల్లోనే ఉన్నారు.