National

లడఖ్ లో 750 కోట్ల వ్యయంతో కేంద్ర విశ్వవిద్యాలయం

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కేంద్ర విశ్వవిద్యాలయం కోసం రూ.750 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. లడఖ్‌ ప్రాంత అభివృద్ది కోసం లడఖ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎల్ఐడీసీఓ) ఏర్పాటు చేస్తున్నారు. లడఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009 సవరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ విశ్వ విద్యాలయాన్ని స్థాపించడం వల్ల ఉన్నత విద్యా రంగంలో ప్రాంతీయ అసమతుల్యతలను తొలగిస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో మేధో వృద్ధికి సహాయపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఉన్నత విద్యా వ్యాప్తికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎల్ఐడీసీఓ కార్పొరేషన్ లడఖ్‌లో పరిశ్రమలు, పర్యాటకం, రవాణా సేవలు, స్థానిక ఉత్పత్తులు, హస్తకళల మార్కెటింగ్ అభివృద్ధిని చూసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 25 కోట్ల అధీకృత వాటా మూలధనంతో కంపెనీల చట్టం కింద కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. కార్పొరేషన్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడటంతో పాటు స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ అధికార పరిధి లేహ్, కార్గిల్ తో సహా మొత్తం లడఖ్ ప్రాంతాన్ని కవర్ చేస్తుందని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

3 × 5 =

Back to top button