అమీర్ ఖాన్ హీరోగా నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ ను రీమేక్ చేశారు. ఈరోజు ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు Voot సెలెక్ట్ సొంతం చేసుకుంది. లాల్ సింగ్ చద్దా OTT హక్కుల కోసం Voot సంస్థ భారీగానే చెల్లించినట్లు తెలుస్తోంది.
లాల్ సింగ్ చద్దా ప్రచార కార్యక్రమంలో, అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ చిత్రం OTTలో ఆలస్యంగా విడుదల చేయబడుతుందని ప్రకటించారు. లాల్ సింగ్ చద్దా థియేట్రికల్ విడుదల తర్వాత కనీసం 6 నెలల తర్వాత OTTలో వస్తుందని అమీర్ ప్రకటించారు. ప్రేక్షకులను థియేటర్‌లకు వచ్చేలా చేయడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు లాల్ సింగ్ చద్దాకు రివ్యూలు కూడా మంచిగా రాలేదు. భారీ రెస్పాన్స్ వస్తుందని అమీర్ ఖాన్ ఊహించినా.. థియేటర్స్ దగ్గర అలాంటి పరిస్థితి కనిపించలేదు. అయితే ఇక వూట్ సెలెక్ట్ సినిమా స్ట్రీమింగ్ విషయంలో 6 నెలలు వేచి ఉంటుందో లేదో చూడాలి. లాల్ సింగ్ చద్దా చిత్రంలో అమీర్, నాగ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు.