Telugu States

టీఆర్ఎస్ లోకి చేరిపోయిన ఎల్.రమణ

తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దిక్కుగా ఉన్న టీడీపీ తెలంగాణ‌ అధ్యక్షుడు ఎల్.రమణ ఆ పార్టీని వీడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ ఆ పార్టీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు టీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు. ఎల్‌.ర‌మ‌ణ‌తో పాటు ప‌లు సంఘాల నేత‌లు, ఆయ‌న‌ మ‌ద్ద‌తుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మార‌డంపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవ‌ల‌ ర‌మ‌ణ చ‌ర్చ‌లు జరిపారు. తెలంగాణభవన్ లో కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరగా.. రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. 16న హుజురాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారు.

ఎల్.రమణ పార్టీలో చేరుతున్న కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక ఈనెల 16వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో నిర్వహించే సభలో ఎల్ రమణను టిఆర్ఎస్ పార్టీ నేతగా అధినేత కెసిఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

టీడీపీకి ఇటీవలే ఎల్ రమణ రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపిన రాజీనామా లేఖలో తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా నా ఎదుగుదలకు తోడ్పాటునందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

జులై 8న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్.రమణ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా టీఆర్ఎస్‌లోకి రావాలసిందిగా కేసీఆర్ ఆయన్ను ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇఛ్చారు. ఆ భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీకి గుడ్‌బై చెప్పారు ఎల్.రమణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్.రమణకు మంచి పట్టుండడం.. టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన బీసీ నాయకుడి కోసం సీఎం కేసీఆర్ అన్వేసిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు తెలంగాణలో బీసీ నాయకునిగా ఎల్. రమణకు గుర్తింపు ఉంది. ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండడం.. పుంజుకునే అవకాశం లేకపోవడంతో ఆయన టీడీపీని విడిచిపెట్టడమే మంచిదని భావించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 5 =

Back to top button