More

  అద్భుతంగా పాట పాడిన అమ్మాయి.. కేటీఆర్ ట్వీట్ చేయడంతో..!

  ట్యాలెంట్ ఉన్న వాళ్ళు మన మధ్యలో ఎంతో మంది ఉంటారు. కానీ పరిస్థితుల కారణంగానో.. మరేదైనా కారణంగానో కెరీర్ గా మలచుకోలేకపోతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు అలాంటి వారికి కూడా అదృష్టం వరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ అమ్మాయి పాడిన జానపద గీతం చూసి తెలంగాణ మంత్రి కేటీఆర్ దగ్గర నుండి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిలో ఉన్న ట్యాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆమె వాయిస్ ను చూసి అవకాశాలు కూడా ఆమెను చేరుతున్నాయి.

  సురేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్టు చేశారు. అమ్మాయి పేరు శ్రావణి అని.. తండ్రి పేరు లక్ష్మణా చారి అని చెప్పుకొచ్చాడు. మెదక్ జిల్లాలోని నారైంగికి వెళ్ళినప్పుడు ఈమె ప్రతిభను చూశాను. చాలా బాగా పాడుతోంది. ఆమె గాత్రం అద్భుతం అని వీడియోను పోస్టు చేశాడు. అమ్మాయి ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు మీ మద్దతు, ఆశీర్వాదం కావాలి అని కేటీఆర్ ను ట్యాగ్ చేసి చేశారు. ఈ వీడియోను చూసిన కేటీఆర్.. ‘నిజంగా ట్యాలెంటెడ్’ అంటూ తమన్, దేవిశ్రీలను ట్యాగ్ చేశారు.

  ఆమె ట్యాలెంట్ అద్భుతమంటూ దేవిశ్రీ ట్వీట్ చేశారు. ట్యాలెంట్ ఉన్న అమ్మాయిని తమకు పరిచయం చేసినందుకు థాంక్యూ అంటూ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రావణికి అవకాశాలిస్తానని హామీ ఇచ్చారు. ఆమె ట్యాలెంట్ ను అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ‘ఆమె బంగారం’ అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆమె పాటను తెగ మెచ్చుకుంటూ ఉన్నారు. సినిమాల్లో పాడే అవకాశాలు ఆ అమ్మాయికి దక్కాలని కోరుకుంటూ ఉన్నారు.

  Trending Stories

  Related Stories